Tirumala tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి కోటా వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ

|

Dec 23, 2021 | 4:48 PM

TTD Seva Tickets: తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.

Tirumala tickets: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జనవరి కోటా వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసిన టీటీడీ
Ttd
Follow us on

TTD Srivari Virtual Seva Tickets: తిరుమల శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. శ్రీవేంకటేశ్వర స్వామివారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు అలాగే, జనవరి 13 నుంచి 22 వరకు తిరిగి జనవరి 26వ తేదీల్లో 5,500 మంది భక్తులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఇందుకు సంబంధించిన వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున; జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే, తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే నేరుగా బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్‌ చేసుకోవాలని భక్తులు టీటీడీ పేర్కొంది.

Read Also..  Tamil Nadu Earthquake: తమిళనాడులో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రత నమోదు!