Tirumala: శ్రీవారి భక్తులకు సూపర్ ఆఫర్.. త్వరలో ఆ సేవా టిక్కెట్లు.. కండిషన్స్ అప్లై..

|

Feb 16, 2022 | 2:57 PM

 Tirumala: కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి(Tirupati) పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. ఈ నేపధ్యంలో శ్రీవారి సంపన్న భక్తుల కోసం టీటీడీ(TTD) శ్రీవారి ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు..

Tirumala: శ్రీవారి భక్తులకు సూపర్ ఆఫర్.. త్వరలో ఆ సేవా టిక్కెట్లు.. కండిషన్స్ అప్లై..
Tirumala
Follow us on

Tirumala: కలియుగ దైవం కొలువైన తిరుమల తిరుపతి(Tirupati) పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. ఈ నేపధ్యంలో శ్రీవారి సంపన్న భక్తుల కోసం టీటీడీ(TTD) శ్రీవారి ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు (Srivari Udayasthamana Seva Tickets) పొందేందుకు సరికొత్త ప్రణాళిక ను రూపొందించింది. ఈ నేపధ్యంలో టీటీడీ వెబ్సైట్ కొత్త అప్లికేషన్ తీసుకొస్తుంది. ఈ నెల 16వ తేదీన టీటీడీ వెబ్ సైట్ లో అప్లికేషన్ విడుదల చేయనుంది. టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు విరాళమిచ్చిన దాతలకు ప్రివిలైజ్ గా ఉదయాస్తమాన టికెట్ ను టీటీడీ కేటాయించనుంది.

ప్రానదాన ట్రస్టుకు ఎవరైనా భక్తులు రూ.1.5 కోటి విరాళమిస్తే శుక్రవారం..  రూ.1 కోటి విరాళమిస్తే మిగిలిన రోజుల్లో ఉదయాస్తమాన సేవా భాగ్యం కల్పించనుంది. అయితే శుక్రవారాల్లో కేవలం 28 ఉదయస్తమాన సేవా టికెట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇక మిగిలిన రోజుల్లో 503 టికెట్లు ఖాళీగా ఉన్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆసక్తి గాస్ల భక్తులు ఈ ఉదయస్తమాన సేవలను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా  బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఆఫ్ లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా ఆన్ లైన్ లో రూ.5 లక్షలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలని టీటీడీ ప్రకటించింది. అయితే ఆఫ్ లైన్ ద్వారా మిగిలిన మొత్తం చెల్లించని పక్షంలో అడ్వాన్స్ గా కట్టిన   రూ.5 లక్షలు రీఫండ్ చేయమని తెలిపింది. అంతేకాదు ఒక మనిషికి ఒక టికెట్ మాత్రమే కేటాయిస్తామని టీటీడీ స్పష్టం చేసింది.

వ్యక్తిగతంగా విరాళమిచ్చిన భక్తులకు 25 ఏళ్లు పాటు సంవత్సరంలో ఒక రోజు దాతతో కలిపి ఆరు గురికి ఉదయస్తమాన సేవను కల్పించనుండి. అదే ఏవైనా కంపెనీలు అయితే 20 ఏళ్ల పాటూ ఉదయస్తమాన సేవను కల్పించనుంది.

శని, ఆది, సోమవారాల్లో ఉదయస్తమాన సేవ భక్తులకు సుప్రభాతం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందని ప్రకటించింది.

మంగళ, బుధ,గురువారాల్లో టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన (మంగళవారం), తిరుప్పావడ సేవ(గురువారం), కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది.

అదే శుక్రవారాల్లో ఉదయస్తమాన సేవా టికెట్లు కలిగిన భక్తులకు సుప్రభాతం, అభిషేకం, తోమాల, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్త్ర దీపాలంకార సేవల్లో పాల్గొనే అవకాశం ఇస్తోంది. 

Also Read:

మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కూతురు చూసిందని.. తల్లి కర్కశత్వం