AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా

ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.

Tirumala: వేసవి చివరిలో శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. జూన్‌లో ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా
Venkanna Income
Raju M P R
| Edited By: |

Updated on: Jul 02, 2025 | 1:24 PM

Share

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటి లాడింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. రోజుకు సగటున 80 వేల మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది. జూన్ నెలలో రూ 119.86 కోట్ల మేర హుండీ ద్వారా టీటీడీ కి ఆదాయం రాగా 24.08 లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. ఇక ఈ నెల ఆఖరి రోజు అంటే జూన్ 30న శ్రీవారి హుండీ ఆదాయం రూ 5.30 కోట్లు రాగా జూన్ 14 న అత్యధికంగా 91,720 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ చెబుతోంది.

ఇక ఈ నెలలో మొత్తం 5 రోజులు ప్రతిరోజు 90 వేలకు పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 10 రోజులు ఒక్కో రోజు 80వేల మంది కి పైగా భక్తులు వెంకన్నను దర్శించుకోవడం మరో రికార్డు. ఇక రోజు సగటున రూ. 4 కోట్ల మేర హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రాగా మొక్కులో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు కూడా 10.05 లక్షల మంది ఉన్నారు. ఇక గత మే నెల హుండీ ఆదాయం, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యకు భారీ తేడానే ఉండగా వేసవి లో జూన్ నెల టీటీడీ కి కీలకంగా మారింది.

మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా టీటీడీకి రూ 106.83 కోట్ల ఆదాయం చేకూరింది. ఇలా జూన్ నెలలో భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం రెండూ పెరగ్గా టీటీడీ కూడా భక్తుల సంఖ్య తగ్గట్టుగానే విస్తృత సేవలు అందించింది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
మొన్నటివరకు ఫిజియో థెరపిస్ట్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
తెలంగాణలో అత్యంత పేదరికంలో మగ్గుతున్నవారికి శుభవార్త..!
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
Hyderabad: ఇబ్రహీంబాగ్ సరస్సులో హాట్ ఎయిర్ బెలూన్ అత్యవసర ల్యాండి
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
ఐశ్వర్య రాజేష్ క్యూట్ ఫోటోలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
కొత్త అజెండాతో పెట్టుబడులకు సీఎం రేవంత్ స్కెచ్..!
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
తానాజీ పార్ట్‌ 2 హింట్ ఇచ్చిన అజయ్ దేవగన్‌.. సీక్వెలా.. ప్రీక్వెల
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
తురిమిన కొబ్బరిని ఇలా నిల్వ చేస్తే నెలల తరబడి వాడుకోవచ్చు
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్స్ రైడ్‌.. ఇలా బుక్‌ చేసుకోండి!
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
ధనుష్- మృణాళ్ పెళ్లి రూమర్లు.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?