Sai Baba Puja Tips: గురువారం షిరిడీ సాయిబాబును ఇలా పూజించి చూడండి.. అనుగ్రహంతో కష్ట, నష్టాలు దూరం అవుతాయి..

|

Aug 31, 2023 | 8:09 AM

షిర్డీ సాయిబాబా మహిమ అపరిమితమైనదని భక్తుల విశ్వాసం. ఆయన ఎప్పుడూ కులం, మతం లేదా జీవుల మధ్య వివక్షత చూపలేదు. ఎవరైతే భక్తితో సాయిబాబాని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు అంటారు. గురువారాల్లో ఉపవాసం ఉండటం వల్ల సాయి ప్రత్యేక అనుగ్రహం తన భక్తులపై కురుస్తాడు.  సాయిబాబా ఎప్పుడూ 'సబ్ కా మాలిక్  ఏక్ హై ' అనే సందేశాన్ని ఇచ్చేవారు.

Sai Baba Puja Tips: గురువారం షిరిడీ సాయిబాబును ఇలా పూజించి చూడండి.. అనుగ్రహంతో కష్ట, నష్టాలు దూరం అవుతాయి..
Shirdi Sai Baba
Follow us on

గురువారం సాయిబాబా ఆరాధనకు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే సాయిబాబాను విశ్వసించే వారు ఆయనను పూజలతో పూజించడమే కాకుండా ఆయన ఆశీస్సులు పొందేందుకు ఉపవాసం కూడా ఉంటారు. సాయిబాబాను హృదయపూర్వకంగా ఆరాధిస్తే తన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం.  ఎవరైనా షిర్డీ సాయిబాబాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తే, ఆయనను స్మరిస్తే, సాయిబాబా తమ జీవితంలో  ఆనందాన్ని నింపుతాడని నమ్మకం. గురువారం రోజున చేసే పూజ విధానం .. ప్రాముఖ్యతను ఈ రోజు తెలుసుకుందాం.

షిర్డీ సాయిబాబా మహిమ అపరిమితమైనదని భక్తుల విశ్వాసం. ఆయన ఎప్పుడూ కులం, మతం లేదా జీవుల మధ్య వివక్షత చూపలేదు. ఎవరైతే భక్తితో సాయిబాబాని పిలిస్తే తన భక్తులను చేరుకుంటాడని ప్రజలు అంటారు. గురువారాల్లో ఉపవాసం ఉండటం వల్ల సాయి ప్రత్యేక అనుగ్రహం తన భక్తులపై కురుస్తాడు.  సాయిబాబా ఎప్పుడూ ‘సబ్ కా మాలిక్  ఏక్ హై ‘ అనే సందేశాన్ని ఇచ్చేవారు. విశ్వాసాల ప్రకారం, సాయిబాబా తనను పూర్తి విశ్వాసంతో పూజించే భక్తులకు ఎటువంటి కష్టము ఎదురైనా వాటిని తొలగిస్తాడని విశ్వాసం.

సాయి పూజ విధానం

సాయిని పూజించాలంటే ముందుగా గురువారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని.. అభ్యంగ స్నానమాచరించాలి.

ఇవి కూడా చదవండి

స్నానం చేసిన తర్వాత సాయిబాబాను ధ్యానించాలి. గురువారం ఉపవాస దీక్షను చేపట్టాలి.

శరీరం, మనస్సు స్వచ్ఛంగా ఉండేలా చూసుకుని సాయిబాబా విగ్రహం లేదా చిత్రపటం ప్రతిష్టించి.. దానిపై గంగాజలం చల్లండి. విగ్రహంపై పసుపు రంగు వస్త్రాన్ని ఖచ్చితంగా ఉంచాలి.

సాయిబాబా విగ్రహానికి కుంకుమ, పూలు, అక్షతలు కూడా సమర్పించాలి.

పళ్ళెంలో అగరబత్తులు, నెయ్యి వేసి సాయిబాబాకు హారతినివ్వాలి.

ముఖ్యంగా విగ్రహానికి పసుపు పుష్పాలను సమర్పించండి. అనంతరం అక్షత, పసుపు పువ్వులను చేతిలోకి తీసుకుని బాబా కథను వినండి.

సాయిబాబా పూజకు పసుపు రంగు శుభప్రదంగా పరిగణించబడుతుంది. అందుకే బాబాకు పసుపు మిఠాయిలను మాత్రమే సమర్పించండి.

పూజ అనంతరం నైవేద్యం పెట్టిన మిఠాయి ప్రసాదాన్ని అందరికీ పంచండి. మీరు దానం చేయగలిగితే, మీ సామర్థ్యం మేరకు ఆపన్నులకు దానం చేయండి.

సాయిబాబా ఉపవాసం ఎప్పుడు ఆచరిస్తారు?

సాయిబాబా వ్రతాన్ని ఆచరించడానికి గురువారం అత్యంత విశిష్టత కలిగిన రోజు. బాబా భక్తులు ఈ రోజున ఉపవాసం ప్రారంభించి నియమ నిబంధనల ప్రకారం పూజలు చేయాలి. కనీసం 9 గురువారాలు ఉపవాసం పాటించాలి. ఉపవాస సమయంలో పండ్లు తినడం మంచిది. ఉపవాసం ప్రారంభించేటప్పుడు 5, 7, 9, 11 లేదా 21 వారాలు ఉపవాసం ఉంటానని చెప్పాలి. గురువారం రోజున ఉపవాసం ఉన్నవారు ఈ రోజున పేదలకు ఆహారాన్ని అందించాలి. శక్తిమేరకు దానం చేయాలి. పేదలకు సేవ చేసిన వారి పట్ల సాయిబాబా చాలా సంతోషిస్తారు.

సాయిబాబా ఉపవాసం చేసే విధానం

గురువారం సాయిబాబా ఉపవాసం దీక్ష సంకల్పించాలి. బాబాను నిర్మల హృదయంతో పూజిస్తేనే గురువారం వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది.

చిన్నపిల్లలు, వృద్ధులు లేదా స్త్రీలు ఎవరైనా సరే ఉపవాసాన్ని ఆచరించవచ్చు కానీ ఉపవాసాల సంఖ్య 9 గురువారాలు ఉండాలి.

బాబా ఉపవాస సమయంలో మనశ్శాంతి కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇతరులపై పగ పెంచుకోకుండా ప్రయత్నించండి.లేకపోతే పూజ ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

కఠిన ఉపవాస దీక్ష బాబా మెచ్చరు. కనుక మీ సామర్థ్యాన్ని బట్టి ఈ ఉపవాసాన్ని పాటించవచ్చు. ఒక పూట భోజనం లేదా పండ్లు,  అల్పాహారం కూడా తీసుకోవచ్చు.

ఏవైనా అనుకోని కారణాల వల్ల మీరు గురువారం ఉపవాసం మిస్ అయితే లేదా అలా చేయలేకపోతే.. ఆ గురువారం లెక్కించవద్దు. నెక్స్ట్ గురువారం ఉపవాసం కొనసాగించండి.

ఉపవాస సమయంలో సాయిబాబాకు ప్రసాదం సమర్పించిన తర్వాత, దానిని ఇతరులకు పంచాలి.

స్త్రీలు ఉపవాస సమయంలో రుతుక్రమం మొదలైన సమస్యలను ఎదుర్కొంటే లేదా కొన్ని కారణాల వల్ల ఉపవాసం చేయలేకపోతే, వారు ఇతర గురువారాల్లో కూడా ఉపవాసం ఉండవచ్చు.

బాబా ఉపవాసం చేస్తున్న సమయంలో బాబా సచ్చరిత వంటి పుస్తకాలను 5, 11 లేదా 21 పుస్తకాలను బంధువులకు లేదా పొరుగువారికి ఇవ్వవచ్చు. ఇలా చేయడం వలన ఉద్యాపనను పూర్తి అవుతుంది.

ఆఖరి రోజున ఉపవాస సమయంలో ఉపవాసం ఉండే వ్యక్తి పేదలకు అన్నదానం చేయాలి.

ఉపవాస సమయంలో సాయిబాబా ఆలయాన్ని సందర్శించి దీపం వెలిగించండి.

ఉపవాస సమయంలో మీరు టీ, పండ్లు మొదలైన వాటిని కూడా తీసుకోవచ్చు.

సాయి వ్రతం సమయంలో చేయకూడని తప్పులు

సాయిబాబాకు ఉపవాస చేసే సమయంలో ఎవరితోనూ అనుచితంగా ప్రవర్తించకండి.

సాయిబాబాను పూజించేటప్పుడు గొప్పను ప్రదర్శించవద్దు. లేదా ఎక్కువ  నైవేద్యాలు పెట్టకూడదు.

సాయిబాబాకి ప్రసాదం అందించిన తర్వాత, మరుసటి రోజు ఆ ప్రసాదాన్ని ఎప్పుడూ భద్రపరచకండి.

సాయిబాబా కు నైవేద్యంగా పెట్టిన తర్వాత మిగిలిపోయిన ప్రసాదాన్ని ఎప్పుడూ విసిరివేయకూడదు. అందుకు బదులుగా ఆ ప్రసాదాన్ని ఆవులకు, కుక్కలకు లేదా ఇతర జీవులకు పంచండి.

షిర్డీ సాయిబాబాను పూజించేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. లేకపోతే మీరు బాబాను పూజించినా  పూర్తి పుణ్యాన్ని పొందలేరు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)