Lalithambigai Temple: ఇక్కడ ఆలయంలో అమ్మవారిని నేతిలో దర్శించుకుంటే.. భార్యాభర్తలు అనోన్యంగా జీవిస్తారట..

|

Oct 07, 2021 | 8:02 PM

Lalithambigai Temple: భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. హిందూ ధర్మంలో మహాదేవుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వంటి దేవుళ్ళనే కాదు.. అమ్మవారిని..

Lalithambigai Temple: ఇక్కడ ఆలయంలో అమ్మవారిని నేతిలో దర్శించుకుంటే.. భార్యాభర్తలు అనోన్యంగా జీవిస్తారట..
Lalithambigai Temple
Follow us on

Lalithambigai Temple: భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. హిందూ ధర్మంలో మహాదేవుడు, రాముడు, కృష్ణుడు, హనుమంతుడు వంటి దేవుళ్ళనే కాదు.. అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. దేశ వ్యాప్తంగా అనేక చోట్ల అమ్మవారి పుణ్యక్షేత్రాలున్నాయి. అలాంటి ఒకటి పుణ్య క్షేత్రం.. అమ్మవారిని శాంతపరచిన మహాదేవుని ఆలయం.. ఈ ఆలయంలో లలితా పారాయణ స్తోత్ర చేస్తే భక్తులు కోరినకోర్కెలు తీర్చే దివ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది మేఘనాథస్వామి లలితాంబిక ఆలయం. పరమేశ్వరుడు మేఘనాథస్వామిగా జగన్మాత పార్వతీదేవి లలితాంబికగా ఆవిర్భవించిన తమిళనాడులోని తిరువరూర్‌ జిల్లాలో దివ్యక్షేత్రం వివరాల్లోకి వెళ్తే..

స్థలపురాణం

పాండాసురుడనే రాక్షసుడిని నుంచి భక్తులను రక్షించడానికి జగన్మాత పరాశక్తి యజ్ఞగుండం నుంచి శ్రీచక్రరథంపై ఆసీనురాలై లలితాంబికగా ఆవిర్భవించింది. పాండాసురుని సంహరించిన అలితాంబిక ఆగ్రహంతో ఉన్నప్పుడు పరమేశ్వరుడు ఆదేశంతో ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసింది.  అనంతరం వాక్‌దేవతలను సృష్టించి తనకు సహస్రనామాలతో పూజచేయమని అమ్మవారు కోరగా ఆ నామాలు.. ఇప్పుడు లలితాస్తోత్రంగా ప్రసిద్ధి పొందాయి.

అభయహస్తంలో అమ్మవారు

ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు, జగన్మాత అభయహస్తంతో భక్తులను ఆశీర్వదిస్తుంది.  ఇక ఈ ఆలయంలో స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తమిళ మాసమైన చితిరాయ్‌( ఏప్రిల్‌ -మే)లో నేరుగా తాకుతాయి. ఇక భక్తులు తమ ఆయుస్సు పెంపు కోసం యమధర్మ రాజుకి ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా  60, 80వ పుట్టిన రోజుని ఇక్కడ జరుపుకోవడం శుభమని భావిస్తారు.  అంతేకాదు అమ్మవారిని నేతిలో దర్శించుకుంటే జీవితాంతం భార్య భర్తల మధ్య మనస్పర్థలు రాకుండా ఉంటాయని భక్తుల విశ్వాసం.

అన్న ప్రసాదం

ఈ ఆదిదేవుడిని గరుత్మంతుడు,  వానర రాజులు వాలి, సుగ్రీవ, యమధర్మరాజు, శనీశ్వరులు పూజలు నిర్వహించారు. భగవంతుడికి నైవేద్యంగా అన్నం పెట్టి  అనంతరం ప్రసాదంగా స్వీకరిస్తారు. ఈ ప్రసాదం అనేక రోగాల నుంచి విముక్తులను చేస్తుందని భక్తుల నమ్మకం.

ఆలయానికి ఎలా చేరుకోవాలంటే: 

తిరువరూర్‌కు 25 కి.మీ.దూరంలో ఉంది. తిరుచ్చిరా పల్లిలో విమానాశ్రయం ఉంది. ఇక రైల్వే ద్వారా వెళ్లాలనుకునేవారికి సమీప రైల్వేస్టేషన్‌ పేరళంలో దిగి అక్కడ నుంచి కార్లు, ఆటోల ద్వారా  ఆలయానికి చేరుకోవచ్చు.

Also Read:  స్కూల్ ప్రాజెక్ట్‌లో దేశీ వాషింగ్ మెషిన్‌ను తయారు చేసిన స్టూడెంట్.. వీడియో వైరల్..

 రేపు గాయత్రీ అమ్మవారి అలంకారం.. ఏ నైవేద్యం పెట్టాలంటే.. తయారీ విధానం