Puja Rules: ఇంట్లో పూజా-పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా ?

|

Feb 25, 2021 | 2:39 PM

హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో

Puja Rules: ఇంట్లో పూజా-పారాయణం చేసే సమయంలో పాటించాల్సిన నియమాలెంటో తెలుసా ?
Follow us on

హిందూ సాంప్రదాయంలో పూజా పారాయణంకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా మన దేశంలో పూజా చేసాకే రోజును ప్రారంభిస్తుంటారు. సనాతన ధర్మంలో స్నానం చేసిన తర్వాతే ఏ పని అయిన ప్రారంభిస్తుంటారు. ముఖ్యంగా పూజా స్థలానికి సంబంధించి వాస్తు నియమాలు పేర్కొనబడ్డాయి. పూజా మందిరంలో ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు లాంటి విషయాలు కూడా వాస్తుశాస్త్రంలో ప్రస్తావించారు. సాధారణంగా మనం రోజూ ఉపయోగించే కొన్ని వస్తువులను పూజలో ఉంచుతాం. అయితే ఏవి ఉన్నా లేకపోయినా కొన్ని వస్తువులు మాత్రం పూజగదిలో తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. అయితే పూజా చేసే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూజా నియమాలు..

1.ఎప్పుడూ ఒక చేత్తో దేవుని ముందు నమస్కరించకూడదు. దీంతోపాటు భగవంతుడిని పూజించిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. నిద్రిస్తున్న వ్యక్తుల పాదాలను తాకకూడదు.
2. పూజా చేసే సమయంలో జపించే మంత్రం సరిగ్గా ఉచ్చరించాలి. అలాగే మంత్రాలను జపించేప్పుడు కదలకూడదు. ఆ సమయంలో కుడిచేతిని ఏదైన వస్త్రంతో కప్పాలి. ఇలా చేయడంవలన మనసులోని కోరికలు నేరవేరుతాయి.
3. శనివారం రోజున శని నుంచి విముక్తి పొందడానికి పీపాల్ చెట్టుకు నీటిని అర్పించాలి. పీపాల్ చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేయాలి. అలాగే మహిళలు కుంకుమా, కొబ్బరిని కత్తిరించకూడదు. అలాగే దేవుడికి సమర్పించే నైవేద్యాలను దాటకూడదు.
4. ఏకాదశి, అమావాస్య, పౌర్ణిమ రోజులలో గడ్డం తీయకూడదు. పూజా చేసే ముందు కండువా ధరించాలి.
5. పూజా సమయంలో మీ ఎడమవైపున నెయ్యి దీపం వెలిగించాలి. దేవతలను కుడివైపున ఉంచాలి. అలాగే బియ్యంపైన దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం.
6. తామర పువ్వు 5 రాత్రులు ప్రశాంతంగా ఉండదని నమ్ముతుంటారు. అలాగే తులసి ఆకులను కూడా 10 రాత్రులు ఉంచకూడదు.
7. పూజా చేస్తున్న సమయంలో మీ ముఖాన్ని తూర్పు వైపు ఉంచాలి. కుడివైపు నీరు, శంఖంతోపాటు పూజా సామాగ్రిని ఉంచాలి. అదే సమయంలో గంట మరియు సూర్యుడిని ఎడమ వైపు ఉంచాలి.

Also Read:

మాఘ పూర్ణిమ 2021: మాఘ పూర్ణిమ ప్రాముఖ్యత ఏమిటి ? ఆరోజున ఏవిధంగా భగవంతుడిని ఆరాధించాలంటే..