జ్యోతిషశాస్త్రం ప్రకారం మీ జీవితం ఎలా ఉంటుంది..? జరిగి పోయిన.. జరగనున్న.. భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి మనం తెలుసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరంతో అతను ఎలాంటివాడో మూందే ఊహించవచ్చని జ్యోతిష్యలు చెబుతుంటారు. అంతేకాదు అతని జీవితం గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. దీంతో మీరు ఆ వ్యక్తి స్వభావం, అతని ఇష్టాయిష్టాలు అలాగే అతని నడవడిని గుర్తించవచ్చు. ఒక వ్యక్తి పేరు అతని జీవితంతో ముడిపడి ఉంటుంది. అందుకే చాలా కుటుంబాలు తమ పిల్లలకు చాలా ఆలోచనాత్మకంగా పేరు పెడతాయి. పిల్లల పుట్టిన తరువాత వారి పేరు రాశిచక్రంలోని అక్షరం నుంచి తీసుకుంటారు. ఒక వ్యక్తి పేరు వెనుక అనేక అర్థాలు దాగి ఉంటాయి. అందుకే చాలా మంది పిల్లల పేర్లు రాశిచక్రాన్ని బట్టి నిర్ణయిస్తారు.
జ్యోతిషశాస్త్రంలో పేరు జ్యోతిషశాస్త్ర శాఖలో పేరులోని మొదటి అక్షరం నుంచి వ్యక్తి విధి, స్వభావం, ఆర్థిక స్థితిని తెలుసుకోవచ్చు. అకస్మాత్తుగా అదృష్టం ఎలా పలకరిస్తుందో ముందే చెప్పవచ్చు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన అలాంటి వ్యక్తుల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తులు తమ అదృష్టం, ప్రతిభ ఆధారంగా అపారమైన సంపదను కూడా సంపాదిస్తారు.
‘A’ తో మొదలయ్యే పేర్లు: ‘A’ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ఈ వ్యక్తుల అదృష్టం 25 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత మొదలవుతుంది. ఈ వ్యక్తులు చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు. వీరు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు.
‘C’తో మొదలయ్యే పేర్లు: ‘C’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సవాళ్లతో పోరాడే అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు తమ లక్ష్యాన్ని సాధించడానికి తీవ్రంగా శ్రమిస్తారు. అకస్మాత్తుగా విజయం సాధిస్తారు. వీరు చాలా డబ్బు సంపాదిస్తారు.
‘H’తో మొదలయ్యే పేర్లు: ‘H’ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు.. గొప్ప నాయకులుగా నిరూపించుకుంటారు. ఈ సామర్థ్యం ఆధారంగా.. వీరు తక్కువ సమయంలో భిన్నమైన స్థానాన్ని సంపాదించి.. డబ్బు, కీర్తిని పొందుతారు.
‘K’తో మొదలయ్యే పేర్లు: ‘K’ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వారికి అన్నీ కలిసి వస్తాయి. వీరు చాలా కష్టపడి పనిచేసేవారు, తెలివైనవారు. వీరు తమంతట తాముగా ప్రతిదీ అందిపుచ్చుకుంటారు. కానీ అదే సమయంలో వీరు తమ శత్రువులను చాలా మందిని తయారు చేసుకుంటారు.
‘S’ తో మొదలయ్యే పేర్లు: ‘S’ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు.. ప్రతిదీ చాలా బాగా నిర్వహిస్తారు. ఓ పద్దతి ప్రకారం నడుచుకునేందకు ప్రయత్నిస్తారు. ఈ వ్యక్తులు అద్భుతమైన శక్తి, సానుకూలతను కలిగి ఉంటారు. వీరు మంచి రాజకీయ నాయకులు. అంతే కాదు మంచి వక్తలుగా పేరు తెచ్చుకుంటారు. వీరు మాట్లాడుతూ ఉంటే వీనే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఈ వ్యక్తులు తమ కృషి, తెలివితేటలతో చాలా డబ్బు సంపాదిస్తారు. 35 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా విజయం సాధిస్తారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం