Mahabharata Moral Story: హిందువులు పవిత్రంగా భావించే రామాయణ మహాభారతాల్లో మనిషి జీవిత విధానం ఉంది. మనిషి ఎలా జీవించాలి.. ఎలా జీవించకూడదు.. మనిషి చేసే మంచి చెడులు ఎలా జీవితం పై ప్రభావం చూపిస్తాయి అన్నీ ఈ పురాణాలద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా హిందూ ధర్మంలో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు.. అందుకనే ఇప్పటికీ చాలామంది ఈ రోజు చేసిన తప్పుకి ఈరోజు శిక్షపడక పోవచ్చు.. కానీ తప్పనిసరిగా దేవుడు చేసిన తప్పుకి శిక్ష ఏదొక రూపంలో విధిస్తాడు అని అంటారు.. అందుకు ఉదాహరణగా ఈ కథ నిలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. దీంతో కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. వందమంది కుమారులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోక సంద్రంలో మునిగిపోయి ఉన్నాడు. అదే సమయంలో పాండవులను తీసుకుని అడుగు పెట్టిన కృష్ణుడిని చూసి.. భోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు.
అదే సమయంలో కోపంతో ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని నిలదీస్తాడు. అన్ని తెలిసి కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు మొదటి నుంచి నువ్వు జరిగేదంతా చూస్తూ ఉండిపోయావు. ఇంత ఘోరం జరగకుండా ఎందుకు ఆపలేదు కావాలనే ఇదంతా జరిగేలా చేశావు.. నాకు ఈరోజు పుత్ర శోకాన్ని ఎందుకు కలిగేలా చేశావు అంటూ ఆవేశంతో నిలదీస్తాడు.
ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు సంధానం చెబుతూ.. ఓ రాజా ఇందంతా చేసింది నేను కాదు.. జరగనిచ్చింది నేను కాదు.. ఇలా జరగడానికి నీ వంద మంది కుమారులు మరణించి నీకు పుత్ర శోకం కలగడానికి కారణం నువ్వు.. నీ పూర్వ జన్మ కర్మ అని చెబుతాడు. అంతేకాదు ధృతరాష్ట్రుడికి గత జన్మల గురించి చెబుతూ.. నువ్వు 50జన్మల క్రితం ఒక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు ఏమీ దొరకలేదు. అప్పుడు ఒక అశోక వృక్షం మీద నివసిస్తున్న రెండు గువ్వల జంటను.. వాటి గుండుని చూశావు.. ఆ గువ్వలను చంపడానికి నువ్వు బాణం వేశావు.. అవి తప్పించుకున్నాయి.
ఆ గువ్వల జంట… తమ కళ్ళ ముందే వందమంది పిల్లలు ఆలా విచ్చిన్నం అవుతున్నా ఏమీ చేయలేని అసహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. ఆ పక్షుల గర్భ శోకం నిన్ను వదలకుండా వెంటాడుతూనే ఉంది. ఈ జన్మలో నీ పాపం నుంచి విముక్తి అయ్యి.. కర్మం బంధం నుంచి విడిపించింది. అని చెబుతాడు. అంతేకాదు.. నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా,
ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మనిన్నుతప్పకవెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది.
కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు” అని కృష్ణుడు అంటాడు.
అయితే ధృత రాష్ట్రుడు కొంచెం సేపు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే 50 జన్మలుఎందుకువేచిఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు.
దీంతో మళ్ళీ కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఓ రాజా వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతోపుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కార్యాలు చేయాలి. నువ్వు ఈ యాభై జన్మల్లో ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు.
వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని కృష్ణుడు చెప్పాడు. అది విన్న ధృత రాష్ట్రుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తూనే కుప్పకూలిపోతాడు.
మహాభారతంలోని ఈ కథ మనకు ఏమి చెబుతుంటే.. మనం జన్మ జన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్కచెడ్డపనితో తుడిచిపెట్టుకుని పోతాయని అంతార్ధం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పుకు ఎన్ని జన్మలేత్తయినా శిక్ష అనుభవించాలని ..
Also Read: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో 3 రోజులపాటు వాన కురిసే అవకాశం