శ్రీరాముడు పుట్టిన భూమి అయోధ్య (ayodhya) రామ మందిర నిర్మాణం శరవేగంగా దూసుకెళ్తోంది. పనులు 40 శాతం పూర్తయినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ మేరకు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వివరాలు వివరించారు. 2020 ఆగస్టు 5న నిర్మాణ పనులను ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ విషయాలను విడుదల చేశారు. కాగా.. డిసెంబర్ 2023 నుంచి భక్తులకు శ్రీరాముడి దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆలయం చుట్టూ రహదారులు, అంతే కాకుండా వెయ్యి ఏళ్లు పటిష్ఠంగా నిలబడే విధంగా ఆలయ పునాదులు నిర్మించినట్లు తెలిపారు. గర్భగుడిలో రాజస్థాన్‌లోని (Rajasthan) మక్రానా తెల్లటి మార్బుల్‌ను వినియోగిస్తున్నారు. ప్రాకారాలకు 8-9 లక్షల ఘనపు అడుగుల చెక్కిన ఇసుక రాయిని; అడుగు భాగానికి 6.37 లక్షల ఘనపు అడుగుల గ్రానైట్, ప్రధాన ఆలయానికి 4.7 లక్షల ఘనపు అడుగుల గులాబి రంగు ఇసుక రాయి, 13,300 ఘనపు అడుగులు మక్రానా తెల్లటి మార్బుల్‌ను గర్భగుడికి, అంచులకు 95,300 చదరపు అడుగుల మక్రానా తెల్లటి మార్బుల్‌ను నిర్మాణంలో ఉపయోగిస్తున్నట్లు చంపత్ రాయ్ వివరించారు.
అంతకు ముందు భోగి పండుగ రోజున అయోధ్య ట్రస్ట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. రామ మందిర నిర్మాణ ప్రక్రియను వివరించే 3డీ యానిమేషన్ వీడియోను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. ఐదు నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేకతలు, సాంకేతికతలను చిత్రీకరించారు. ఏరియల్ వ్యూ గా ఆలయానికి చేరుకునే రోడ్డు మార్గం, గతంలో కట్టిన శ్రీరామ మందిరంతో పాటు ప్రస్తుతం నిర్మిస్తోన్న రామ మందిరం వంటి దృశ్యాలు మనసు దోచుకుంటున్నాయి. రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, అది త్వరలో సిద్ధమవుతుందని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది.
మందిర నిర్మాణం కోసం తవ్వకాలు జనవరి 2021లో ప్రారంభమయ్యాయి. మార్చి 2021లో పూర్తయ్యాయి. ఈ స్థలాన్ని 5 జోన్‌లుగా విభజించారు. ఈ ఆలయంలో మొత్తం 360 నిలువు వరుసలు ఉన్నాయని. ఒక్కో దానిలో శివుని అవతారాలు, దశావతారాలు, సరస్వతి దేవి 12 అవతారాలు వంటి అనేక విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు.
भगवान श्री राम की पावन जन्मभूमि पर निर्माणाधीन मंदिर के प्रस्तावित गर्भगृह की वर्तमान स्थिति के कुछ चित्र प्रस्तुत हैं।
Here are some pictures from the proposed Garbha Gruha of Shri Ram Janmbhoomi Mandir in Ayodhya. pic.twitter.com/nDmanhUfsb
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) August 26, 2022
మరిన్ని ఆధ్యాత్మికం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి