ఆలయ గోపుర కలశ రహస్యం ఏంటో తెలుసా..? దాని శాస్త్రీయ వాస్తవాలు ఎంత గొప్పవంటే..

|

Aug 22, 2023 | 3:48 PM

అందుకే ఆలయ శిఖరం ఎత్తుగా నిర్మిస్తే.. ఈ ఎత్తైన టవర్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ నిల్వ ఉంచిన ధాన్యాలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు. దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు, కలశం, పూజా సామాగ్రి, ఇతర సంబంధిత వస్తువులను తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన కళాకారులు ఆగమ శాస్త్రాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. తదనుగుణంగా వారు తమ పనిని చేస్తారు.

ఆలయ గోపుర కలశ రహస్యం ఏంటో తెలుసా..? దాని శాస్త్రీయ వాస్తవాలు ఎంత గొప్పవంటే..
Temple Kalasam
Follow us on

సాధారణంగా రాజుల పాలనలో పట్టణంలోని ఆలయ గోపురం కంటే ఎత్తుగా ఏ భవనమూ ఉండకూడదని ఆంక్షలు విధించేవారు. ఎందుకంటే ఆలయ గోపురం పైభాగంలో ఉన్న కలశం బంగారం, వెండి లేదా రాగితో తయారు చేస్తారు. ఈ కలశాలలో పోసిన ధాన్యాలు, లోహాలకు విద్యుదయస్కాంత తరంగాలను ఆకర్షించే శక్తి ఉండదు. అదేవిధంగా ఆలయ గోపుర కలశంలో వరి, జొన్న,మొక్కజొన్న, నువ్వులు, రాగులు, మినుములు వంటి ధాన్యాలతో నింపుతారు. ఇందులో ముఖ్యంగా తృణధాన్యాలు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే పిడుగుపాటును తట్టుకునే మహాశక్తి వాటికి ఉంటుదని చెబుతారు. ఈ టెక్నిక్ అత్యంత కచ్చితమైనదని ప్రస్తుత శాస్త్రం చెబుతోంది. అలాగే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నాశనమైనా ఆలయ శిఖరం పైనున్న కలశం నుంచి ధాన్యాన్ని తిరిగి వ్యవసాయానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

ప్రతి కలశంలో నింపిన ధాన్యాలు సుమారు 50 కిలోల కంటే ఎక్కువగానే ఉంటాయి. వరదలు లేదా కొన్ని రకాల శక్తివంతమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, మొక్కలు, పంటలు మొదలైన వాటిని తుడిచిపెట్టే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ప్రజలకు జీవనోపాధి, మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆహార కొరతను నివారించడానికి, ధాన్యాలు – సాగు ప్రయోజనం కోసం కలశం నుండి తీసివాడుకుంటారు. ఇది భవిష్యత్తులో వృద్ధికి అవకాశం కల్పిస్తుంది. విస్తారమైన వరదలు సంభవించినప్పుడు, నీటి మట్టం ఎత్తులో ఉన్న కలశాలను తాకదు. గింజలు సురక్షితంగా ఉంటాయని నమ్మకం. ఈ శిఖరం పైన ఉన్న కలశంలోని ధాన్యం వర్షాలకు రక్షణగా, పొడిగా ఉంటుంది. వాటిని తిరిగి విత్తడానికి ఉపయోగించవచ్చు. ఇంకొక వాస్తవం ఏమిటంటే, లోహ కలశంలోని ఈ ధాన్యం/ పప్పులు నిర్మాణంపై పిడుగుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దానికి ఎలాంటి హాని కలుగకుండా నివారిస్తాయి.

ముఖ్యంగా, ఈ ధాన్యాల సంభావ్యత 12 సంవత్సరాల వరకు ఉంటుంది. అప్పుడు గింజలు తమ శక్తిని కోల్పోతాయి. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి ఆ ఊళ్లో ప్రత్యేక పండుగ నిర్వహించి కలశంలోని పాత గింజలను తొలగించి కొత్త గింజలతో నింపుతారు. నేటి కాలంలో వారు దానిని ఒక సంప్రదాయంగా మాత్రమే అనుసరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే గింజలన్నీ నీటమునిగి నశించిపోతాయి. విత్తనాలు లేక మళ్లీ పంటలు పండడం కష్టమవుతుంది. అందుకే ఆలయ శిఖరం ఎత్తుగా నిర్మిస్తే.. ఈ ఎత్తైన టవర్‌లోకి నీరు వచ్చే అవకాశం ఉండదు. ఇక్కడ నిల్వ ఉంచిన ధాన్యాలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు.

దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు, కలశం, పూజా సామాగ్రి, ఇతర సంబంధిత వస్తువులను తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన కళాకారులు ఆగమ శాస్త్రాలపై మంచి అవగాహన కలిగి ఉంటారు. తదనుగుణంగా వారు తమ పనిని చేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..