దేవతారాధనలో గజ్జె వస్త్రానికి ప్రత్యేక స్థానం.. ఎప్పుడు, ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటంటే..?

దేవతలకు చేసే పవిత్ర అలంకార వస్త్ర మాలలో గజ్జె వస్త్రము ఒకటి. దూదీతో చేసినటువంటి వస్త్రాలతో దేవతలను అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఈ సాంప్రదాయం దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను గజ్జె వస్త్రముతో అలంకరించారు.

దేవతారాధనలో గజ్జె వస్త్రానికి ప్రత్యేక స్థానం.. ఎప్పుడు, ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటంటే..?
Vasavi Kanyakaparameshwari

Edited By:

Updated on: Jan 21, 2026 | 6:50 PM

దేవతలకు చేసే పవిత్ర అలంకార వస్త్ర మాలలో గజ్జె వస్త్రము ఒకటి. దూదీతో చేసినటువంటి వస్త్రాలతో దేవతలను అలంకరిస్తారు. ప్రత్యేకంగా ఈ సాంప్రదాయం దక్షిణాది రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలోని వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను గజ్జె వస్త్రముతో అలంకరించారు.

దక్షిణ భారత ఆలయ సంప్రదాయాల్లో కర్ణాటకలోని తెలుగు ప్రాంతాల్లో ఇలాంటి అలంకరణకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. గిజ్జా, గజ్జె వస్త్రము అంటే గజ్జెల్లా కనిపించే అంచులతో ఘంట, దంత ఆకృతిలో ఉంటాయి. దూదీని ఆంధ్ర ప్రాంతంలో పూజల సమయంలో ఒత్తిగా చేసి అమ్మవారి ముందు దీపంలా వెలిగిస్తారు. అదేవిధంగా పూజ సమయంలో వస్త్రము సమర్పయామి అన్నప్పుడు వస్త్రాలకు బదులుగా దూదీతో చేసిన మాలను దేవుడి ముందు ఉంచుతారు.

దూదీ ప్రాధాన్యత ఏంటి..?

పూజల్లో శుద్ధత, సాత్వికతకు చిహ్నంగా దూదీని వాడతారు. వేడుకల సమయంలో విగ్రహానికి ఇలాంటి అలంకరణ సౌకర్యంగా ఉండటంతో పాటు దీర్ఘకాలం మన్నుతుంది. దూదీని శంకువులా, గుండ్రని ఆకృతిలో చుట్టి పూసలను దండలోకి ఎక్కించినట్లు మాలల తయారు చేస్తారు. దూదీ పూసకు మధ్యలో కుంకుమ రాయటంతో ఈ వస్త్రమాలలు పారిజాత పూలమాలగా అందంగా కనిపిస్తుంటాయి.

ఇలాంటి పత్తి అలంకార వస్త్ర మాల దేవతలకు చేస్తే రక్షణాత్మక, మంగళకరమైనమని వాసవి పెనుగొండ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ చెబుతున్నారు. ఆధ్యాత్మిక భావనలో గజ్జె ఆకృతి శబ్ద తత్వం కలిగి మంగళ సూచకమని , దృష్టి, దోష నివారణ తో కూడిన రక్షణ భావన ఈ అలంకరణ ద్వారా కలగటంతో పాటు శక్తి ప్రవాహ భావన కలుగుతందని ఆయన వివరించారు. ప్రస్తుతం 8 రోజుల ఉత్సవాల్లో భాగంగా చేసిన గజ్జె వస్త్ర అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

వీడియో ఇక్కడ చూడండి…

మరిన్ని అధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..