Yadadri Temple: యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. బాలాలయంలో పంచకుండాత్మక యాగం

|

Mar 21, 2022 | 10:30 AM

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి (Sri Lakshami narasimha swami) ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు( Mahasamprokshana)  ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి..

Yadadri Temple: యాదాద్రిలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ.. బాలాలయంలో పంచకుండాత్మక యాగం
Yadadri Temple
Follow us on

Yadadri Temple: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి (Sri Lakshami narasimha swami) ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ మహాక్రతువు( Mahasamprokshana)  ప్రారంభమైంది. విశ్వక్సేనుడి తొలిపూజ స్వస్తి పుణ్యహ వాచన మంత్రాలతో నారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణకు అంకురార్పణ చేశారు అర్చకులు. బాలాలయంలో పంచకుండాత్మక యాగం కోసం యాగశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వెదురు కర్రలతో యాగశాలను నిర్మించారు.

వారం పాటు సాగనున్న పంచకుండాత్మక యాగం.. ఈనెల 28న మహాసంప్రోక్షణ క్రతువుతో పూర్తి కానుంది. యాగం కోసం బాలాలయంలో ఐదువిధాలుగా కుండాలను ఏర్పాటుచేశారు. తూర్పున చతురస్రాకారాంలో, పడమర వృత్తాకారంలో, ఉత్తరంలో త్రికోణం, దక్షిణంలో అర్ధచంద్రకారం, ఈశాన్యంలో పద్మాకారంలో హోమగుండాలను ఏర్పాటు చేశారు. యాగం కోసం 24 రకాల ద్రవ్యాలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నారు.

108 మంది పండితులతో ఏడు రోజులపాటు సాగే పంచకుండాత్మక యాగం తర్వాత మహాకుంభ సంప్రోక్షణ ఈనెల 28న నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, శాంతి కళ్యాణంతో మహాక్రతువు ముగియనుంది.

Also Read:

Viral Photo: పూజ గదిలో వొడ్కా బాటిల్‌ .. నెట్టింట వైరల్‌ అవుతున్న ఫోటో.. అమ్మలు అంతే అంటున్న నెటిజన్లు