Shivling Temple: దేశంలో అతిపెద్ద శివలింగ ఆలయం ఔరంగాబాద్‌లో నిర్మిస్తున్నారు. అజంతా-ఎల్లోరా గుహల సమీపంలో ఉంటుంది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు ఈ ఆలయ గర్భంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రతిరూపాల పనులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 12 విగ్రహాల ప్రదక్షిణను సులభతరం చేయడానికి ఇక్కడ ప్రత్యేక ప్రదక్షిణ మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.
26 ఏళ్లుగా ఈ పథకంపై పనులు
ఈ దేవాలయ నిర్మాణం1995లో ప్రారంభమైంది. ముందుగా108 అడుగుల శివలింగాన్ని నిర్మించే ప్రయత్నం చేశారు. కానీ అవసరమైన నిధులు అందలేదు. ఈ కారణంగా1999 లో ఆలయ నిర్మాణ పనులను నిలిపివేశారు. గత సంవత్సరం మళ్లీ ఈ ఆలయ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ గొప్ప దేవాలయ నిర్మాణం 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.
ఆలయానికి ఎలా చేరుకోవాలి?
ఇక్కడికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు సర్వీసులు, రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అవసరమైతే మన్మాడ్ రైల్వే జంక్షన్‌కు వెళ్లి అక్కడ నుంచి ఔరంగాబాద్‌కి చేరుకోవచ్చు. మహేంద్ర బాపు మార్గదర్శకత్వంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మహేంద్ర బాపు గుజరాత్‌లోని చాండోన్ నివాసి. ఆలయం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది.
వర్షాకాలంలో మేఘాల నుంచి నీటి చుక్కలు శివలింగంపై పడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. ఆలయం ఎత్తు 60 అడుగులు, శివలింగం ఎత్తు 40 అడుగులు. మొత్తం ఆలయ సముదాయం 108 చదరపు అడుగులు ఉంటుంది. ఈ ఆలయం సంప్రదాయ దక్షిణ భారతీయ నిర్మాణానికి చక్కటి ఉదాహరణ. శివుడు, విష్ణువు పది అవతారాలు ఆలయ గోడలపై చిత్రీకరించారు. నందీశ్వరుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు.