
మీరు అనుకోకుండా కలలో స్నానం చేసినట్లు కనిపిస్తే స్వప్న శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. నది ఒడ్డున, బాత్రూంలో లేదా బావి దగ్గర స్నానం చేస్తున్నట్లు కల వస్తే అటువంటి కలను శుభప్రదంగా పరిగణించవచ్చు. ఈ కల మీకు జరగనున్న శుభాలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా జలపాతం వద్ద లేదా మరెక్కడైనా శుభ్రమైన నీటిలో స్నానం చేస్తున్నట్లు కలలుకంటున్నట్లయితే.. ఆ కలలను చాలా మంచి కలలుగా పరిగణించవచ్చు. రానున్న రోజుల్లో ఆనందం, సంపదను పొందుతారని ఈ కల ద్వారా చెబుతోందట. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటారని అర్ధమట.
ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు మీరు స్నానం చేస్తున్నట్లు కలలు కన్నట్లయితే.. రానున్న రోజుల్లో మీరు అనారోగ్యం నుంచి కోలుకుంటారని స్వప్న శాస్త్రం ఈ కలకు అర్ధం చెబుతుంది. మీరు మంచి ఆరోగ్యంతో ఉండి.. ఇలాంటి కల వస్తే.. రాబోయే రోజుల్లో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు మరింత జాగ్రత్తగా ఉంటారని ఈ కలకు అర్ధమట
మరోవైపు మురికి నీటితో స్నానం చేస్తున్నట్లు కల వస్తే.. ఈ కల అంత మంచిది కాదని అర్ధమట. ఈ కల రానున్న రోజుల్లో మీరు కొంత మానసిక క్షోభను అనుభవిస్తారని హెచ్చరిస్తుంది. ఈ కల మీరు చేసే ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంది. ఈ కల మీరు ప్రమాదకర పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. పని చేసే ముందు తెలివిగా ఆలోచించాలని చెబుతుంది.
మీరు మీ పాదాలను కడుగుతున్నట్లు కలలుగన్నట్లయితే.. ఆ కల చాలా మంచి కలగా పరిగణించవచ్చు. మీరు చాలా నెలలు లేదా సంవత్సరాలుగా ఒక లక్ష్యాన్ని సాధించడానికి కష్టపడుతున్నా.. లేదా ప్రయత్నిస్తున్నా రాబోయే రోజుల్లో ఆ లక్ష్యాన్ని సాధిస్తారో లేదో ఈ కల మీకు చెబుతోంది. మొత్తం మీద మీరు కలలో మంచి నీటిలో స్నానం చేస్తే అది శుభ సంకేతం.. మీరు చెడు నీటిలో స్నానం చేస్తే అది అశుభ సంకేతంగా స్వప్న శాస్త్రం పేర్కొంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు