Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..

అందరూ కలలు కంటారు. ఈ కలల ద్వారా ప్రకృతి మనకు కొన్ని సూచనలు ఇస్తుందని స్వప్న శాస్త్రం పేర్కొంది. స్వప్న శాస్త్రం ప్రకారం మనకు నిద్రలో వచ్చే ప్రతి కలకు ఏదోకటి అర్ధం ఉంది. భవిష్యత్ గురించి ఏదో ఒకటి చెబుతుంది. మంచి లేదా చెడును సూచిస్తుంది. అయితే మీ కలలో మూడు ప్రత్యేక పక్షులు కనిపిస్తే శుభ సంకేతం. ఆ పక్షులు ఏమిటి? అవి మనకు ఎలాంటి సంకేతాలను ఇస్తాయో తెలుసుకుందాం.

Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..
Swapna Shastram

Updated on: Apr 18, 2025 | 11:08 AM

హిందూ మతంలో మానవ జీవితంలో కలలకు చాలా ప్రాముఖ్యత ఉంది. రాత్రి సమయంలో మనకు వచ్చే కలలు ఖచ్చితంగా మన జీవితానికి సంబంధించిన కొన్ని సూచనలను ఇస్తున్నాయని.. తెల్లవారుజామున వచ్చే కలలు నిజం అవుతాయని ఈ కలల సంకేతాలను స్వప్న శాస్త్రంలో వివరంగా వివరించారు. కలలలో కనిపించే విషయాలు జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలను సూచిస్తాయి. స్వప్న శాస్త్రం ద్వారా కలలలో కనిపించే విషయాలకు సంబంధించిన అర్థాన్ని మనం తెలుసుకోవచ్చు.

మనం కలలో ఏది చూసినా.. దానికి ఖచ్చితంగా కొంత అర్థం ఉంటుంది. ఈ కలలు భవిష్యత్తులో ఏమి జరగబోఉన్నాయో సూచిస్తాయి. ఈ రోజు మనం భవిష్యత్ ని తెలియజేసే కలల గురించి తెలుసుకుందాం.. మీ కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్థం చేసుకోండి.

కలలో రామ చిలుకను చూడండి

స్వప్న శాస్త్రం ప్రకారం.. మీరు మీ కలలో రామ చిలుకను చూసినట్లయితే.. మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి. అంటే చిలుకను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. చిలుకను చూడటం ఆర్థిక లాభానికి సంకేతం అని అంటారు. మీ కలలో రామ చిలుకల జత కనిపిస్తే.. అది వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుందని అర్థం. రామ చిలుకను చూడటం కూడా ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తుందనడానికి సంకేతం.

ఇవి కూడా చదవండి

కలలో గుడ్లగూబ చూడండి

మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే.. అది మీ ఇంట్లో లక్ష్మీ దేవి రాకకు సంకేతం. మీరు గుడ్లగూబను చూసినట్లయితే ఆర్థిక సమస్యలు ముగిసిపోతాయని అర్థం చేసుకోండి. గుడ్లగూబను చూడటం కూడా వ్యాపారం, ఉద్యోగంలో పురోగతికి సంకేతమని స్వప్న శాస్త్రం పేర్కొంది.

కలలో నెమలిని చూడటం

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో నెమలిని చూడటం చాలా శుభ సంకేతం. నెమలి కార్తికేయుడి వాహనం. అందుకే కలలో నెమలిని చూడటం అంటే ఆఫీసులో విజయాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అలాగే ఇలాంటి కల ఇంటిలో ఆనందం, శ్రేయస్సు పెరుగుదలను సూచిస్తుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు