వినాయక చవితి పండగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండగలలో ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం గణపతి జన్మ దినం రోజుని వినాయక చవిటిగా భద్ర మాసం శుక్ల చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది వినాయక చవితి పండగను సెప్టెంబర్ 7 వ తేదీన జరుపుకోనున్నారు. ఈ రోజున శివపార్వతిల తనయుడు గణేశుడు భు లోకానికి వస్తాడని విశ్వాసం. శాస్త్రోక్తంగా పూజిస్తారు. గణేశుడు జ్ఞానానికి ప్రతీక. చవితి రోజు నుంచి అనంత చతుర్థి వరకు 10 రోజుల పాటు ఉత్సవాలను జరుపుకుంటారు. ఈ 10 రోజుల్లో వినాయకుడు కలలో కనిపిస్తే అది చాలా మంచిదని భావిస్తారు. స్వప్న శాస్త్రం ప్రకారం వినాయకుడు కలలో కనిపిస్తే ఇంట్లో సంపదలు కురుస్తాయట. అయితే ఏ రకమైన వినాయకుడు కలలో కనిపిస్తే ఏ విధమైన ఫలితం ఉంటుందో తెలుసుకుందాం..
కలలో వినాయకుడి విగ్రహం కనిపించడం చాలా శుభప్రదం. అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఈ కల వినాయకుడు కనిపిస్తే త్వరలో భక్తుని ఇంటిలో లేదా ప్రియమైన వ్యక్తి వివాహం, లేదా ఒక శుభ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
కలలో ఎలుక స్వారీ చేస్తున్న గజాననుడు గణేశుడు కనిపిస్తే అది సంపదకు సూచికగా పరిగణించబడుతుంది. త్వరలో ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయని డబ్బు ప్రవహిస్తుందని అర్థం. ఆనందం, శాంతి నెలకొంటుంది. ఆ వ్యక్తులు ధనవంతులు కావడానికి సంకేతంగా వినాయక దర్శనం అని స్వప్న శాస్త్రంలో పేర్కొంది.
తెల్లవారు జామున బ్రహ్మ ముహర్తంలో గగణేశుడు కల కనిపిస్తే ఈ కలకు అర్ధం లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుందట. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కరుణతో సంపద ఆ ఇంటిని ముంచెత్తుతుంది. వినాయకుని ఆశీస్సులతో ఆకస్మిక ధనం లభిస్తుందట. అంతే కాకుండా కెరీర్‌లో ప్రమోషన్ అవకాశాలు పెరగవచ్చు లేదా మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయట.
కలలో గణేశుడిని పూజిస్తున్నట్లు కనిపిస్తే ఈ కల చాలా శుభప్రదం. అంటే కోరికలన్నీ త్వరలో నెరవేరబోతున్నాయని అర్ధమట. గణేశుని ఆశీస్సులతో జీవితంలోని అన్ని దుఃఖాలు, సమస్యలు తొలగిపోయి వినాయకుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవిస్తారట.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండ్
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు