అయ్యప్ప భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు కేరళ ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వాడుకుంటుంది. గతంలోనే అయ్యప్ప భక్తులకు అన్ని రకాల వివరాలు, సహాయ సహకారాలు అందించేందుకు వాట్సాప్ నెంబర్‌ని రిలీజ్ చేసింది. దీంట్లో భక్తులు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా వెంటనే కాంటాక్ట్ చేయొచ్చు. కొద్ది నిమిషాల్లోనే కాల్ సెంటర్ నుంచి ఆ భక్తులకి ఫోన్ కాల్ అందుతుంది.
ఇక ఇప్పుడు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాక్స్‌ని రిలీజ్ చేసింది. ఇందులో శబరిమల వెళ్లే భక్తులకు ఎప్పటికప్పుడు లైవ్ వెదర్ అప్డేట్స్ అందించనుంది. పత్తనంతిట్టా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఈ లైవ్ చాట్ రూపొందించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకుంటారు. ట్రైన్ ద్వారా వచ్చినా, ఫ్లైట్ ద్వారా వచ్చినా.. శబరిమల కొండకు చేరుకునే వరకు లైవ్ అప్డేట్స్ అందుతూనే ఉంటాయి. దీనికోసం భక్తులు సింపుల్‌గా 6238008000 నెంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్ లో హాయ్ అని పంపిస్తే చాలు. వెంటనే ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ చాట్ బాక్స్ మిమ్మల్ని కొన్ని వివరాలు అడుగుతుంది. మీరు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు… ఏ మార్గంలో వస్తున్నారు.. ఏ సమయానికి కొండకు చేరుకుంటారు? ఈ వివరాలు తెలిపితే అప్పటినుంచి కొండపైకి వెళ్లి దర్శనం చేసుకునే వారికి లైవ్ వెదర్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దీంతో భక్తులు వాతావరణ సూచనలకు అనుకూలంగా దర్శనం ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ చాట్ బాక్స్ కూడా ఐఎండి శాఖకు కనెక్ట్ అయి ఉంటుంది. ఒకవేళ కొండపై భారీగా వర్షాలు పడుతుంటే భక్తులకు వెంటనే అలర్ట్ పంపిస్తుంది. ఎక్కడ ఆగితే మంచిదో కూడా సూచిస్తుంది. ఇది కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఏ భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎవరికీ ఇబ్బంది కలుగుతుంది? ఎవరు ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకోవచ్చు కూడా. ఈ సీజన్లో కోట్లాదిమంది భక్తులు పోటెత్తే శబరిమల కొండపై ఇలాంటి సమాచారం ఇవ్వడం చాలా మంచిది అంటున్నారు అయ్యప్ప భక్తులు. ముందస్తు సమాచారం ఉంటే ఒకేసారి కొండపైకి వెళ్లకుండా… రద్దీ ఏర్పడకుండా, తొక్కిసలాటలు జరగకుండా చూసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..