
ఈ రోజు ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణ సమయంలో ప్రజలు కొన్ని విషయాలను విస్మరించకూడదు. ఎందుకంటే ఈ ఏడాది సూర్యగ్రహణం ప్రజలకు చాలా ప్రత్యేకం. గ్రహణం పర్యావరణంపైనే కాదు ప్రజల జీవితాలపై కూడా అనేక ప్రభావాలను చూపుతుంది. కనుక సూర్యగ్రహణం, సూతకాల సమయంలో కొన్ని పనులు చేయడం లేదా చేయకపోవడం మంచిది. సూర్యగ్రహణం సమయంలో వంట చేయడం, పూజలు చేయడం మొదలైన ఏ విధమైన మతపరమైన కార్యకలాపాలు చేయడం మంచిది కాదని ఒక నమ్మకం ఉంది. ఇలా చేయడం వల్ల సూర్యగ్రహణం ప్రభావం వల్ల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ సంవత్సరం మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం భారత దేశ కాల మానం ప్రకారం ఈ రోజు (ఏప్రిల్ 8) రాత్రి 9:12 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే ఏప్రిల్ 9 ఉదయం 1:20 గంటలకు.. గ్రహణం విడిచే వరకు సూత కాలం కూడా ఉంటుంది. ఈ కాలంలో ప్రజలు దూరంగా ఉండవలసిన అనేక కార్యకలాపాలు ఉన్నాయి. ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం…
సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది . కనుక సూర్యగ్రహణం సమయంలో సూర్యకాంతి డైరెక్ట్ గా పడే విధంగా బయటకు వెళ్లవద్దు. ఇంట్లోనే ఉండండి. గ్రహణాన్ని నేరుగా చూడకండి. సూర్యుని హానికరమైన కిరణాల ద్రుష్టిపై ప్రభావం చూపిస్తాయి. సూర్యగ్రహణం సమయంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. కనుక ప్రజలు డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కోవచ్చు. సూర్యగ్రహణం సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడితే.. శరీరంలో నీటి కొరత లేకుండా ఉండటానికి, నీరు, జ్యూస్, షర్బత్ మొదలైనవి అధికంగా తాగండి. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సూర్యగ్రహణం సమయంలో రాహువు ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు, ప్రతికూల శక్తులు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. కాబట్టి గ్రహణ సమయంలో అశుభ ప్రదేశాలకు వెళ్లవద్దు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు