Arasavelli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్య కిరణాలు

|

Mar 10, 2022 | 11:21 AM

Arasavelli:ఆరోగ్య ప్రధాత ఆశేష భక్త జనంతో పూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం(Arasavelli Sun Temple)లో అద్భుత దృశ్యం ఆవిషృతం అయంది. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా..

Arasavelli: అరసవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఆవిష్కృతమైన అద్భుతం.. స్వామివారి పాదాలను తాకిన సూర్య కిరణాలు
Arasavelli Suryanarayana Te
Follow us on

Arasavelli:ఆరోగ్య ప్రధాత ఆశేష భక్త జనంతో పూజలు అందుకుంటున్న అరసవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం(Arasavelli Sun Temple)లో అద్భుత దృశ్యం ఆవిషృతం అయంది. ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షంచిన భక్తులు తన్మయత్వం చెందారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీఅర్సవల్లి సూర్య నారాయణ స్వామి దేవాలయం గర్భ గుడిలో కొలువు తీరిన ఆ స్వామి వారిమూల విరాట్‌ను ఉదయించే లేలేత సూర్య కిరణాలు ఏకధాటిగా ఆరు నిమిషాల పాటు సృశించాయి. సూర్యుడు దక్షణాయనం నుంచి ఉత్తరాయణం కి స్థాన చలనం చెందిన సమయంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. శ్రీకృష్ణుడి అన్న బలరాముడు చే 11 వ శతాబద్ధంలో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణంలో అప్పటి ఆర్కిటెక్చర్లు ఆ దేవాలయం నిర్మాణంలో  తీసుకున్న మెలకువల రూప కల్పనే ఈ అద్భుతం ఆవిషిృతానికి నిదర్శనం అని చెప్పక తప్పదు. ఏడాదికి రెండు  పర్యాయాలు మార్చి 9, 10 తేదీల్లోను,  అక్టోబర్ నెల 2, 3 తేదీల్లోనూ ఈ సూర్య కిరణాలు స్వామివారి పాదాలను స్పర్శించడం పరిపాటి.  మార్చి నెలలో సూర్యుడు దక్షిణాయనం నుంచి నుంచి ఉత్తరాయణం కి, అక్టోబర్ నెలలో ఉత్త రాయణం నుంచి దక్షణాక్షిణాయనానికి స్దాన చలనం చెందే ఈ రెండు రెండు రోజుల్లో ఉదయించే సూర్య  కిరణాలు  ఆలయ  ప్రాంగణంలో ఉన్న  గాలి గోపురం, అనీ వెట్టు మండపం,  ఆలయ ముఖ ద్వారం అంగట్లో ఉన్న ధ్వజ స్తంభాన్ని దాటుకుని  గర్భగుడిలో శాలిగ్రామం శిలాతో చేసిన స్వామివారి పాదాల నుంచి శిరస్సు వరకూ కిరణాలు తాకుతాయి.

ఈ రోజు ఆ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు తమకు ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా దర్శించుకునే భాగ్యం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కిరణ స్పర్శ ను కనుల రా చూసిన భక్తుల కంటికి సంబంధించిన  రుగ్మతలు తొలగిపోవడంతో పాటు,  కోరిన కోర్కెలు తీరతాయని అర్చకులు చెబుతున్నారు.

Also Read:

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. స్వామివారి కల్యాణ మహోత్సవానికి హాజరు