Statue of Equality: శ్రీరామానుజుల సందేశం ప్రపంచానికి స్ఫూర్తి.. సహస్రాబ్ధి వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా..

|

Feb 08, 2022 | 8:09 PM

సనాతన ధర్మం అన్నింటికీ మూలమని అమిత్ షా స్పష్టం చేశారు. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్పూర్తి మంత్రమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం అదృష్టంగా..

Statue of Equality: శ్రీరామానుజుల సందేశం ప్రపంచానికి స్ఫూర్తి.. సహస్రాబ్ధి వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా..
Amit Shah
Follow us on

Statue of Sri Ramanunja: రామానుజాచార్య మిలీనియం ఫెస్టివల్‌లో మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సమానత్వ విగ్రహం’ను(Statue of Equality) సందర్శించడం తన అదృష్టం అని అన్నారు. మనుషులంతా ఒక్కటే అన్న రామానుజాచార్యుని సందేశం స్పూర్తిదాయకమన్నారు. భగవత్ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి సమారోహం వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా ఉందందన్నారు. సనాతన ధర్మం అన్నింటికీ మూలమని అమిత్ షా స్పష్టం చేశారు. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్పూర్తి మంత్రమని ఆయన వెల్లడించారు. సమతామూర్తి రాబోయే తరాలవారికి స్పూర్తి మంత్రమని ఆయన అన్నారు.

స్వామీజీ కృషిని దేశం మొత్తం గుర్తుంచుకుంటుంది- అమిత్ షా

రామానుజాచార్య సమానత్వ సందేశాన్ని ఇచ్చారని కేంద్ర హోంమంత్రి షా అన్నారు. దేశాన్ని సమానత్వంతో అనుసంధానించారు. రామానుజాచార్యులు కూడా కుల వివక్షను అంతం చేసేందుకు కృషి చేశారు. స్వామీజీ కృషిని దేశం మొత్తం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. భాషా సమానత్వం కోసం కూడా ఆయన ఎంతో కృషి చేశరని.. రామానుజాచార్యులు సమానత్వాన్ని చాటారు.

సనాతన ధర్మంలో అహం, జడత్వం లేదు: హోంమంత్రి అమిత్ షా

సనాతన ధర్మంలో అహంకారం, జడత్వం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చిన జీయర్ స్వామి వారికి దేశం తరపున ధన్యవాదాలు తెలిపుతున్నాను అంటూ వెల్లడించారు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ వద్దకు చేరుకుని శ్రీరామానుజాచార్యను దర్శించుకున్నారు.

అంతకుముందు లక్నో నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు బీజేపీ నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆశ్రమానికి చేరుకున్న అమిత్ షాకు చినజీయర్ స్వామి (chinna jeeyar swamy ), మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు. తర్వాత సమతామూర్తి కేంద్రంలో ఉన్న 108 దివ్య క్షేత్రాలను అమిత్ షా దర్శించకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహం అత్యంత వైభవంగా జరుగుతోంది. ఏడోరోజు శ్రీరామనగరంలో రథ సప్తమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు, సామూహిక పారాయణ కార్యక్రమాలు నిర్వహించారు. నేడు యాగశాలలో దుష్టగ్రహ బాధానివారణకై శ్రీనారసింహ ఇష్టి, జ్ఞాన జ్ఞానాకృత సర్వవిధ పాపనివారణకు శ్రీమన్నారాయణ ఇష్టి అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీలక్ష్మీ నారాయణ మహాక్రతువులో భాగంగా పెరుమాళ్‌ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద పారాయణం జరిగింది. ఆదిత్య హృదయ సామూహిక పారాయణం చేశారు. అనంతరం శ్రీనారాసింహ అష్టోత్తర శతనామావళి పూజను అహోబిలం రామానుజజీయర్‌ స్వామీజీ నిర్వహించారు.