Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Allu Arjun Visits Samatha Murthy Statue: హైదరాబాద్‌ శంషాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు

Statue of Equality: సమతామూర్తిని దర్శించుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Allu Arjun

Edited By: Anil kumar poka

Updated on: Feb 12, 2022 | 10:20 AM

Allu Arjun Visits Samatha Murthy Statue: హైదరాబాద్‌ శంషాబాద్ ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. ఈ రామానుజాచార్యుల (Ramanuja Sahasrabdi) సహస్రాబ్ది ఉత్సవాలకు వీవీఐపీలతోపాటు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) శ్రీరామనగరంలో సమతామూర్తిని దర్శించుకున్నారు. ముచ్చింతలకు వచ్చిన ఆయన.. సమతామూర్తితో పాటు.. దివ్యాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దుత్వికులు శ్రీరామనగరంలోని సమతామూర్తి ఆలయ విశేషాలను ఆయనకు వివరించారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో జరుగుతున్న యజ్ఞక్రతువులను దగ్గరుండి చూశారు. ఆ తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. సమతామూర్తిని దర్శించుకోవడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని స్టైలిష్‌ స్టార్‌ పేర్కొన్నారు. ఆలయంలో ఉన్నంతసేపు తనువు భక్తితో పులకించిందన్నారు. సమతామూర్తిని ఎంతచూసినా తనివి తీరలేదని అల్లు అర్జున్‌ పేర్కొన్నారు. కాగా.. ఆలయంలో తమ అభిమాన స్టార్‌ను చూసిన కొందరు భక్తులు ఆయన ఫొటోలను తీసుకున్నారు.

Also Read:

Perni Nani: మోహన్‌ బాబుతో భేటీ నా వ్యక్తిగతం.. ఆయన పిలిస్తేనే వెళ్లాను. పేర్నినాని వివరణ..

Bangarraju OTT: బంగార్రాజు సందడి మళ్లీ మొదలవుతుంది.. జీ5 ఓటీటీలో నాగార్జున సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..