Sarva Bhupala Vahana: వరసగా రెండో ఏడాది కూడా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కరోనా నిబంధన నడుమ ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఎనిమిదో రోజుకి చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 7.35 నుండి 9 గంటల వరకు రథోత్సవం బదులుగా శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు.
సర్వభూపాల అంటే రాజులకు రాజు అని అర్థం. ఈ ప్రపంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భక్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహనాన్ని అధిష్టించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దంపతులు, బోర్డు సభ్యులు శ్రీమతి ప్రశాంతి రెడ్డి, శ్రీ ఎపి.నందకుమార్, అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ రమేష్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Also Read: రేపు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం.. నైవేద్యంగా చక్కర పొంగలి.. తయారీ