భక్తులకు అలర్ట్‌.. శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత.. అన్నప్రసాద వితరణ సైతం బంద్

నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే శ్రీశైలం ఆలయం మూతపడింది..ఎందుకు? వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహా మంగళహారతులు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగున్నర నుండి 5:30 వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి అలంకార దర్పణానికి అనుమతించిన అధికారులు, ఉదయం 6 గంటలకు శ్రీ స్వామి అమ్మవారి ఉభయ పరివార ఆలయ ద్వారాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఈవో శ్రీనివాసరావు ఉన్నారు.. అసలేం జరిగిందంటే...

భక్తులకు అలర్ట్‌.. శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేత.. అన్నప్రసాద వితరణ సైతం బంద్
Srisailam

Edited By:

Updated on: Mar 03, 2026 | 9:13 AM

నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయం ద్వారాలు మూసివేశారు దేవస్థానం అర్చకులు,ఈవో శ్రీనివాసరావు. చంద్రగ్రహణం నేపద్యంలో ఈరోజు వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి సుప్రభాతసేవ, ప్రాతకాలపూజలు, మహామంగళహారతులిచ్చి తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు గంట పాటు శ్రీస్వామివారి అలంకార దర్శనానికి అమ్మవారి దర్శనానికి అనుమతించార. ఉదయం 6 గంటల నుండి ఆలయ ద్వారాలు మూసివేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 వరకు ఉభయ దేవాలయాలు,పరివార ఆలయాల ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆలయ సంప్రదాయాలను అనుసరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవారి ఆలయం మూసివేశారు.

అటు, శ్రీశైలంలోని పరివార అలయాలైన సాక్షిగణపతి, హాఠకేశ్వరం-ఫాలధార పంచధార, శిఖరేశ్వరం ఆలయాల ద్వారాలను మూసివేశారు. తిరిగి సాయంత్రం 7:30 కు ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు భక్తులందరికీ శ్రీస్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు. అలానే ఈరోజు అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్షసేవలు, శ్రీస్వామి అమ్మవారి కల్యాణోత్సవం కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రహణం కారణంగా భక్తులకు నిత్యాఅన్నప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

శ్రీస్వామి అమ్మవారి దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులందరు వారి అతిథి గృహాలలో ఉండాలని చంద్రగ్రహణం కారణంగా శ్రీస్వామి అమ్మవారిని స్మరిస్తూ ఉండాలని సూచించారు. రాత్రి 9 నుండి 10:30 వరకు భక్తుల శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకోవాలని, అలానే రేపటి నుండి శ్రీస్వామి అమ్మవారికి అన్ని సేవల, శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలు యధావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us