గ్రహణ గండాలకు అతీతం ఈ దివ్య క్షేత్రం.. గ్రహణ సమయంలోనే ప్రత్యేక పూజలు..!

గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. అయితే తిరుపతి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో మాత్రం పూజలు జరుగుతూనే ఉంటాయి. గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఆలయంలో స్వయంభుగా వెలిసిన మహాలింగానికి 9 గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండమే ప్రత్యేకం.

గ్రహణ గండాలకు అతీతం ఈ దివ్య క్షేత్రం.. గ్రహణ సమయంలోనే ప్రత్యేక పూజలు..!
Srikalahasti Temple

Edited By: Balaraju Goud

Updated on: Sep 07, 2025 | 6:51 AM

ఆ ఆలయం గ్రహణ గండాలకు అతీతం. దోష నివారణలో భక్తుల ఆదరణ పొందిన క్షేత్రం. గ్రహణ కాల సమయంలో గ్రహణ శాంతి అభిషేకాలు జరిగే ఆలయం. రాహు కేతు సర్ప దోష నివారణ క్షేత్రంగా విరాజుల్లుతున్న ఆలయం. గ్రహణ కాలంలో భక్తులకు స్వామి వారి దర్శనం అందుబాటులో ఉండటం ఇక్కడ ప్రత్యేకం.

గ్రహణాల సమయంలో అన్ని ఆలయాలు మూసివేయడం సర్వసాధారణం. ఈ ఆలయం గ్రహణ గండాలకు అతీతం.. శ్రీకాళహస్తి క్షేత్రం.. తిరుపతి జిల్లాలోని ఈ ఆలయం ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి చెందిన ఆలయంగా మారింది. గ్రహణకాల సమయంలో అన్ని ఆలయాలు మూత వేయడం సర్వసాధారణమే. అయితే గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా ఉన్న ఆలయంలో స్వయంభుగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుడి మహాలింగం 9 గ్రహాలు 27 నక్షత్రాలతో అలంకార కవచం ఉండడం ప్రత్యేకం.

రాహు-కేతు, సర్ప దోష నివారణ క్షేత్రంలో అమ్మవారి నడుముకు నాగాభరణం అలంకారంగా ఉండడంతో దోష నివారణ క్షేత్రంగా భక్తులను ఆకట్టుకుంటోంది. స్వయంభుగా వెలిసిన వాయు లింగేశ్వరుడి ఆలయం గ్రహణ కాలంలో మూతపడని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గ్రహణ కాల సమయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా తెరిచి ఉండడం, ప్రత్యేకంగా గ్రహణ శాంతి పూజలు చేయడం ఇక్కడ అనవాయితీగా వస్తోంది.

ఇక రాహు, కేతువుల ఆటలు ఈ క్షేత్రంలో సాగవన్న విషయాన్ని ఆలయ చరిత్ర చెబుతోంది. శిల్ప కళతో చారిత్రక ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందిన శ్రీజ్ఞాన ప్రసూనాంబిక కాళహస్తీశ్వరుడు ఆలయంలో దాదాపు 5 దశాబ్దాల క్రితం రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. ఇక్కడి ఆలయం ప్రాభవం.. పురాణ సహేతుకంగా ఎన్నో నామాలున్నా రాహు, కేతు సర్పదోష నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందుతోంది. గతంలో రోజు వారి దీపాలు వెలిగించేందుకు కష్టాలున్న పరిస్థితుల్లో ఈ పూజలతో రాష్ట్ర దేవా దాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో ముందు వరుసలో స్థానం సంపాదించింది.

అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా రూ.500, రూ. 750, రూ.1500, రూ.2500, రూ.5 వేల టికెట్లతో పూజలు అందుబాటులోకి తెచ్చిన దేవస్థానం ప్రస్తుతం ఏటా రూ. 200 కోట్ల మేర ఆదాయం వస్తుందంటే అందులో ప్రధాన భూమిక రాహు, కేతు పూజలదే. పూజా మండపంలో రాహు, కేతు సర్ప రూపాలు, మహాలింగం ముందు తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలతో అలంకార కవచం ఏర్పాటు చేయడం, అమ్మవారి నడుముకు నాగాభరణం అలంకారంగా ఉండటంతో శ్రీకాళహస్తి క్షేత్రం సర్పదోష నివారణలకు ప్రముఖ క్షేత్రంగా పేరు సంపాదించింది.

జాతక చక్రంలో ఈ రెండు గ్రహాల కారణంగా అనేక సమస్యలు తలెత్తుతుండగా గ్రహస్థితి మెరుగు పడేందుకు వీలుగా ఇక్కడ నిర్వహించే పూజలకు విశేష ఆదరణ పెరుగు తోంది. ఏటా దాదాపు పది లక్షలకు పైగా రాహు కేతు పూజలు జరుగుతుండటం మరో విశేషం. దోష నివారణ పూజలకు విదేశీ ఆదరణ కూడా లభిస్తుండగా అన్ని ఆలయాలు గ్రహణకాల సమయానికి ఆరు గంటల ముందే మూసి వస్తుండగా చంద్రగ్రహణం రోజున శ్రీకాళహస్తి ఆలయం మాత్రం యధావిధిగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పిస్తోంది.

మరన్ని ఆధ్యాత్మక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..