Jahnavi Kapoor: శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి.. అచ్చతెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ

Jahnavi Kapoor In Tirumala: కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమల. ఈరోజు  శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో..

Jahnavi Kapoor: శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాహ్నవి.. అచ్చతెలుగమ్మాయిలా లంగావోణీలో తల్లిని గుర్తు చేస్తోన్న తనయ
Jahnavi Kapoor Tirupati

Updated on: Dec 26, 2021 | 10:46 AM

Jahnavi Kapoor In Tirumala: కలియుగ దైవం కొలువైన శ్రీ వెంటకేశ్వర స్వామి పుణ్య క్షేత్రం తిరుమల. ఈరోజు  శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ జాహ్నవి కపూర్ సహా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వినిత్ శరన్, సంజయ్ కిషన్ కౌల్ తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి  మలయప్పస్వామికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.  జాహ్నవి కపూర్ కు అర్చకులు  దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

అయితే జాహ్నవి కపూర్ అచ్చ తెలుగమ్మాయిలా  లంగావోణీ వేసుకుని వచ్చింది.  జాహ్నవి తన స్నేహితురాలితో కలిసి సాంప్రదాయ దుస్తుల్లో  స్వామివారిని దర్శించుకోవడం అందరిని ఆకర్షించింది.

 

తల్లి శ్రీదేవి బాటలో పయనిస్తూ.. ఇప్పటికే జాహ్నవి బాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి నటి అనిపించుకుంది. కరోనా నేపథ్యంలో జాహ్నవి నటిస్తున్న సినిమాల షూటింగ్ కు అంతరాయం ఏర్పాడింది. అయితే తెలుగు ప్రేక్షకులు జాహ్నవి కపూర్ తెలుగు సినిమాల్లో నటించాలని.. తల్లి శ్రీదేవిలా అలరించాలని  కోరుకుంటున్నారు.

Also Read: అనంతలో ఒమిక్రాన్‌ కలకలం.. ఒకరికి నిర్ధారణ.. మరో ఐదుగురి రిజల్ట్స్ కోసం నిరీక్షణ.. ఆందోళనలో జిల్లా వాసులు..