Mangla Gauri Vratam: భర్త దీర్ఘస్సు కోసం మహిళలు ఆచరించే మంగళ గౌరీ వ్రతం.. ప్రాముఖ్యత, పూజా విధానం మీ కోసం..

|

Jul 11, 2023 | 8:38 AM

శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తే, ఆ తల్లి కోరికలన్నీ తీర్చి,  మహిళలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. అంతేకాదు మంగళవారం రోజున చేసే ఉపవాసం అమ్మవారి ఆశీర్వాదంతో పెళ్లికాని అమ్మాయిలకు కోరుకున్న జీవిత భాగస్వామిని ఇస్తుందని నమ్మకం. ఈ నేపథ్యంలో మంగళ గౌరీ వ్రత పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం.. 

Mangla Gauri Vratam: భర్త దీర్ఘస్సు కోసం మహిళలు ఆచరించే మంగళ గౌరీ వ్రతం.. ప్రాముఖ్యత, పూజా విధానం మీ కోసం..
Mangala Gouri Vratam
Follow us on

శ్రావణ మాసం మహిళలకు చాలా ముఖ్యమైనది మాసంగా పరిగణించబడుతుంది. శ్రావణ మంగళవారం..  పార్వతి దేవి మంగళ గౌరీ రూపాన్ని మహిళలు ఆరాధిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం వివాహిత మహిళలు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తే, ఆ తల్లి కోరికలన్నీ తీర్చి,  మహిళలకు అఖండ సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. అంతేకాదు మంగళవారం రోజున చేసే ఉపవాసం అమ్మవారి ఆశీర్వాదంతో పెళ్లికాని అమ్మాయిలకు కోరుకున్న జీవిత భాగస్వామిని ఇస్తుందని నమ్మకం. ఈ నేపథ్యంలో మంగళ గౌరీ వ్రత పూజా విధానం గురించి ఈ రోజు తెలుసుకుందాం..

మంగళ గౌరీని ఎప్పుడు, ఎలా పూజించాలంటే.. 
పంచాంగం ప్రకారం శ్రావణ మాసంలోని మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ రోజున, స్నానం , ధ్యానం చేసిన తర్వాత మొదటగా, పార్వతి దేవిని, పరమశివుని ధ్యానిస్తూ నియమాలు,  నిబంధనల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని విశ్వాసం.

ఈశాన్య మూలలో కూర్చుని శివ-పార్వతిని పూజించండి. మంగళ గౌరీకి స్మరిస్తూ ఉపవాసాల దీక్షను చేపట్టింది. పూజకు ముందు అమ్మవారిని అలంకరించి..  పూలు, పండ్లు మొదలైనవి సమర్పించాలి. దీని తర్వాత 16 దీపాలు వెలిగించి మంగళ గౌరీ వ్రత విధాన్ని చెప్పుకుంటూ పఠించి హారతి చేయండి. మంగళ గౌరీ వ్రతంలో ఉపయోగించిన వస్తువులను పేద స్త్రీకి దానం చేయాలి.

ఇవి కూడా చదవండి

మంగళ గౌరీ వ్రతం ప్రాముఖ్యత
మంగళ గౌరీ వ్రతం హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ వ్రతాన్ని ఆచరించిన తరువాత, శివుడి వంటి భర్తను ఇవ్వమని పార్వతీదేవిని కోరుకుంటారు. హిందూ విశ్వాసాల ప్రకారం భక్తి, శ్రద్దలతో అమ్మవారిని పూజించి.. ఉపవాసాన్ని ఆచరించే ఏ స్త్రీ అయినా సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని పొందుతుందని విశ్వాసం. స్త్రీ జీవితంలో ఎల్లప్పుడూ ఐశ్వర్యం ఉంటుంది. ఈ ఉపవాసం ప్రభావంతో భర్త దీర్ఘస్సుతో కలకలం సుఖ సంతోషాలతో జీవిస్తాడని మహిళల నమ్మకం. పార్వతి దేవి అనుగ్రహంతో జీవిత భాగస్వామితో ప్రేమ, సామరస్యం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).