Sravana Masam: ఆర్ధిక ఇబ్బందులా.. కోరుకున్న వరుడిని పొందాలా.. శ్రావణ మాసం ఇలా చేసి చూడండి..

|

Jul 29, 2024 | 8:30 AM

వరలక్ష్మీవ్రతం, మంగళ గౌరీ వ్రతాలు నిర్వహిస్తారు. దీంతో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ప్రజలు ఈ నెలలో అనేక చర్యలు తీసుకుంటారు ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం కొన్ని ప్రత్యేక చర్యలకు ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో ఏ రోజున అయినా ఈ చర్యలు చేయవచ్చు. ఈ చర్యలను చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులను, డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

Sravana Masam: ఆర్ధిక ఇబ్బందులా.. కోరుకున్న వరుడిని పొందాలా.. శ్రావణ మాసం ఇలా చేసి చూడండి..
Lord Shiva
Follow us on

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మిక శోభ నెలకొంటుంది. అమ్మవారి ఆలయాలతో పాటు శివ, కేశవుల ఆలయాలలో కూడా భక్తులతో నిండిపోతుంది. ముఖ్యంగా శివ భక్తులు శివునికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తారు. భజనలు చేస్తారు, భండారాలు నిర్వహిస్తారు. అంతేకాదు మహిళలు వరలక్ష్మీవ్రతం, మంగళ గౌరీ వ్రతాలు నిర్వహిస్తారు. దీంతో ఈ మాసంలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. పరమశివుని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన అనుగ్రహం పొందడానికి ఈ మాసం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ప్రజలు ఈ నెలలో అనేక చర్యలు తీసుకుంటారు ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం కొన్ని ప్రత్యేక చర్యలకు ప్రత్యేకమైనది. శ్రావణ మాసంలో ఏ రోజున అయినా ఈ చర్యలు చేయవచ్చు. ఈ చర్యలను చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులను, డబ్బు సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

ఆర్థిక లాభం కోసం: శ్రావణ మాసంలో ఏ రాత్రి అయినా శివలింగం దగ్గర దీపం వెలిగించి, చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు సమస్య ఉంటే ఈ పరిహారం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరించబడతాయి. అదే సమయంలో సిరి సంపదలు పొందుతారు.

రుణ విముక్తికి: ఎవరైనా అప్పుల బాధలో ఉన్నట్లయితే, దాని నుండి విముక్తి పొందాలనుకుంటే కొన్ని అక్షతలను నీటిలో కలపండి. శ్రావణ మాసంలోని ఏదైనా రాత్రి సమయంలో శివలింగానికి ఈ నీటిలో అభిషేకం చేయండి. ఇలా చేయడం ద్వారా రుణ భారం తగ్గడం ప్రారంభమవుతుంది, ఎప్పటి నుంచో రావలసిన డబ్బు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సమస్యల నుండి బయటపడటానికి: శని దోషంతో ఇబ్బంది పడుతుంటే జీవితంలో సమస్యలు నిరంతరం ఇబ్బంది పెడుతుంటే దీని కోసం మీరు ఈ నెలలో ఏదైనా రాత్రి శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.

అడ్డంకులను అధిగమించడానికి: శ్రావణ మాసం రాత్రి, తూర్పు వైపు మీ ముఖాన్ని ఉంచి, శివలింగం దగ్గర వడ పప్పు, ఒక చిన్న శంఖంతో పాటు ఏడు గవ్వలను ఉంచండి. అప్పుడుఓం గం గణపతయే నమః అని జపించండి. ఇలా చేయడం వల్ల అన్ని అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.

సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం: శ్రావణ మాసంలో రాత్రి సమయంలో శివలింగాన్ని పూజించాలనుకుంటే మీ చేతులతో స్వయంగా మట్టి శివలింగాన్ని తయారు చేయండి. ఆ తర్వాత ఆచారాల ప్రకారం పూజించండి. దీని తరువాత ఈ శివలింగానికి ఆవు పాలను సమర్పించండి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుందని భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని నమ్ముతారు.

కోరుకున్న వరుడిని పొందడానికి: శ్రావణ మాసంలో ప్రతిరోజూ 21 బిల్వ పత్రాలను తీసుకుని వాటిపై చందనంతో ఓం నమఃశివాయ అని రాయండి. ఇలా వ్రాసిన తర్వాత శివలింగానికి ఈ అక్షరాలు ఉన్న బిల్వ పత్రాలను సమర్పించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ పరిహారంతో శివయ్య ఆశీర్వాదం లభించి పెళ్లి కాని అమ్మాయిలు కోరుకున్న వరుడిని పొందుతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు