పవిత్రమైన శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పూజలు, వ్రతాలు, శుభకార్యాలలో సందడి నెలకొంటుంది. రేపు శ్రావణ పౌర్ణమి రాఖీ పండగ. మరోవైపు నేడు శ్రావణ మంగళ వారం. ఈ రోజు మంగళ గౌరీ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్దలతో పూజని వ్రతాన్ని ఆచరిస్తారు. ఈరోజు మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పార్వతిదేవి తన భక్తులకు సంతోషాన్ని, సౌభాగ్యాలను అనుగ్రహిస్తుంది. అదే విధంగా శ్రావణ సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. ఇక శ్రావణ మంగళవారం పార్వతిదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున శాస్త్రోక్తంగా చేసే పూజలు శుభ ఫలితాలను ఇస్తాయి. కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. భర్త దీర్ఘాయుస్సు కోసం పార్వతి దేవి అనుగ్రహాన్ని మహిళలు ఎలా పొందవచ్చో ఈ రోజు తెలుసుకుందాం..
వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు కోసం, పిల్లల సంతోషం కోసం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. మరోవైపు ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా పెళ్లికాని అమ్మాయిలు తల్లి గౌరీదేవి కోరుకున్న వరాన్ని ఇస్తుందని.. మంచి వరుడిని వరంగా ప్రసాదిస్తాడని నమ్మకం. అదేవిధంగా మంగళగౌరి వ్రతానికి నియమాలు, నిబంధనల ప్రకారం చేసే పూజలకు చాలా సంతోషిస్తుంది. తనను కోరి కొలిచిన భక్తులు కోరిన వరాలను ఇస్తుంది.
సంతోషం, అదృష్టం కోసం ఆచరించే మంగళ గౌరీ వ్రతం ఉద్యాపన లేకుండా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ ఉపవాసం ఉద్యాపన కూడా శ్రావణ మాసంలోనే చేయాల్సి ఉంటుంది. విశ్వాసం ప్రకారం మంగళ గౌరీ దేవి వ్రతాన్ని ఆచరించి ఉపవాసాన్ని ఆచరించిన తరువాత 17 వ రోజున లేదా 21 వ రోజున ఉద్యాపన చేయాల్సి ఉంది. మంగళ గౌరీ దేవీ వ్రతం ఉద్యాపన శ్రావణమాసంలో శుక్ల పక్షంలో ఏదైనా మంగళవారం చేయవచ్చు, అప్పుడే మంగళ గౌరీ వ్రతం యొక్క పూర్తి ఫలితాలు పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)