Video Viral: శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు భక్తితో ఉడుత ప్రదక్షణలు.. వీడియో వైరల్

|

Apr 05, 2021 | 12:08 PM

Video Viral: కలియుగదైవం వెంకన్నకు దేశ విదేశాలలో భక్తులున్నారు.. కులమతాలకు అతీతంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంటకటేశ్వర దేవాలయాల్లో..

Video Viral: శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ముందు  భక్తితో ఉడుత ప్రదక్షణలు.. వీడియో వైరల్
Uduta Pooja
Follow us on

Video Viral: కలియుగదైవం వెంకన్నకు దేశ విదేశాలలో భక్తులున్నారు.. కులమతాలకు అతీతంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీ వెంటకటేశ్వర దేవాలయాల్లో శనివారం రోజున భక్తులు పోటెత్తుతారు.. అంతేకాదు ముఖ్య పర్వదినాల్లో కూడా స్వామివారిని దర్శించుకుంటారు.. అయితే తాము కూడా స్వామివారి భక్తులమే అంటూ జంతువులూ కూడా అంటున్నాయి. వెంకన్న పై భక్తితో స్వామివారిని కొలుస్తున్న ఉడుత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వేంకటేశ్వరస్వామి గర్భాలయంలోకి వెళ్లిన ఓ ఉడుత.. స్వామివారిని దర్శించుకుంది. అంతేకాదు.. స్వామివారి విగ్రహం ముందు ఎంతో భక్తిగా ఆత్మ ప్రదక్షణ చేసింది. మన పురాణాల ప్రకారం రామాయణంలో ఉడుతకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. శ్రీరాముడు సీత దేవిని రక్షించుకోవడానికి లంకకు వెళ్లే సమయంలో సముద్రాన్ని దాటవలసి వచ్చింది. దీంతో వారథిని వానరుల సాయంతో హనుమాన్, సుగ్రీవాది వారు నిర్మిస్తున్నారు.. లక్షలాది మంది పెద్దపెద్ద రాళ్లని పెళ్లగించి తెచ్చి సముద్రంపై వారధి నిర్మిస్తున్న సయమంలో ఉడుత ఇదంతా చూస్తుంది. అప్పుడు రాముడిపై భక్తితో తనకు చేతనైనంత సాయం చేయాలనీ.. సముద్రం నీటితో తన తోకను తడుపుకుని సముద్రపు ఇసుకలో పొర్లి వానరులు నిర్మిస్తున్న వారధిపై తన తోకను దులుపుతూ సాయం చేసింది. ఇది గమనించిన శ్రీ రాముడు ఆ ఉడుత భక్తి శ్రద్ధలకు ఎంతో ఆనందం చెంది చేతులలోకి తీసుకుని దాని వీపుపై మూడు వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట. దాంతో ఉడుత వీపుపై మూడు చారలు ఏర్పడ్డాయని చెబుతారు. ఈ కథ ఆథారంగా “ఉడుతా భక్తి” అనే మాట వాడుకలోకి వచ్చిందంటారు. మరి అప్పుడు రాముడిపై భక్తిని చూపించిన ఉడుత.. ఈరోజు వెంకటేశ్వర స్వామిపై తన భక్తిని చూపిస్తూ.. ప్రదక్షణలు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఉడుత భక్తిపై ఓ లుక్ వేయండి.

 

 

Also Read: వెన్నముక పని తీరు మెరుగుపరిచి.. ఛాతిని ధృడంగా చేసే యోగాసనం ఏమిటో తెలుసా..!
ప్రపంచంలోనే అతి పెద్ద గుడ్డు.. ఈ గుడ్డు 15 మంది వరకూ ఫుడ్డు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా..!