Solar Eclipse 2022: హిందూమతంలో (Hindu mythology).. గ్రహణాన్ని అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ సమయం దేవుళ్ళకు బాధను కలిగిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. ఇక ఈ గ్రహణం శనిశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు శనివారం ఏర్పడితే.. పరిస్థితులు మరింత తీవ్రంగా మారతాయని భావిస్తున్నారు. నేటి సూర్యగ్రహణం శని అమావాస్య 2022 నాడు ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణంతో పాటు శని దేవుడి ప్రభావం కూడా ప్రజలపై ఉంటుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం 30 ఏప్రిల్ 2022 అర్ధరాత్రి 12:15 నిమిషాల నుండి ప్రారంభమై మే 1 ఉదయం 4:8 వరకు కొనసాగుతుందని శాస్త్రజ్ఞులు తెలిపారు. శనైశ్చరమావాస్య నాడు శని దేవుడిని అనుగ్రహం పొందాలంటే.. కొన్ని పూజలతో పాటు.. కొన్ని దానాలు చేయమని సూచిస్తున్నారు. ఈ రోజున శని దేవుడిని ఆరాధించడం ద్వారా కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాంటి కొన్ని పూజలు, దానం గురించి తెలుసుకుందాం..
ఆవనూనె దీపం:
శనీశ్వరుడి, సూర్య భగవానుని ఆరాధనలో ఆవనూనెకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మీరు ఈ రెండు దేవతలను ప్రసన్నం చేసుకోవాలనుకుంటే, ఈ ప్రత్యేకమైన రోజున ఆవనూనె దీపాన్ని వెలిగించండి. ఆలయానికి వెళ్లి శని దేవుడి ముందు ఆవనూనె దీపం ఉంచండి. జీవితంలో శాంతి, ఆనందాన్ని కోరుకుంటున్నాను. శనీశ్వరుడికి నలుపు రంగు చాలా ఇష్టమైనది.. కనుక నల్లని వస్త్రాన్ని సమర్పించండి.
ఆంజనేయ స్వామి ఆరాధన:
శనీశ్వరుడి ప్రభావాన్ని నివారణ కోసం హనుమంతుడిని ఆశ్రయించడం శ్రేయస్కరమని చెబుతారు. హనుమంతుడిని ఆరాధించేవారిపై శనీశ్వరుడి ప్రభావం ఉందని ఓ వరం ఉంది. ఈ కారణంగా శనివారం శని దేవుడితో పాటు హనుమంతుడిని పూజించాలని పురాణాలు పేర్కొన్నాయి. ఈ రోజున హనుమాన్ చాలీసా పఠించండి. హనుమంతుడిని సూర్య భగవానుడి కుమారుడిగా పరిగణిస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సూర్యగ్రహణం ప్రభావం నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
దానం చేయాల్సిన పద్ధతులు:
హిందూ ధర్మంలో దాన ధర్మానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి, శని అమావాస్య నాడు నల్లని వస్తువులను దానం చేయండి. నల్ల మినప పప్పు, నల్లని దుస్తులు, నల్ల నువ్వులు దానం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తొలగుతాయని నమ్మకం. గ్రహణం రోజు పేదలకు ఏదైనా దానం చేయడం ద్వారా సూర్య భగవానుడి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు,నమ్మకం పై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..