Jagannath Temple: 21 రోజుల తర్వాత మళ్ళీ తెరచుకోనున్న పూరి జగన్నాథుని ఆలయం.. దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై..

|

Jan 30, 2022 | 6:59 AM

Puri Jagannath Temple: దేశంలో కరోనా వైరస్(Corona Virus) థర్డ్ వేవ్ లో మళ్ళీ భారీగా కేసులు నమోదు కావడంతో ఒకొక్క రాష్ట్రం కరోనా నివారణల చర్యలో భాగంగా పలు ఆంక్షలను విధించింది. ఈ నేపధ్యంలో ఒడిశా(Odisha)లో.

Jagannath Temple: 21 రోజుల తర్వాత మళ్ళీ తెరచుకోనున్న పూరి జగన్నాథుని ఆలయం.. దర్శించుకోవాలంటే కండిషన్స్ అప్లై..
Puri Jagannatha Temple
Follow us on

Puri Jagannath Temple: దేశంలో కరోనా వైరస్(Corona Virus) థర్డ్ వేవ్ లో మళ్ళీ భారీగా కేసులు నమోదు కావడంతో ఒకొక్క రాష్ట్రం కరోనా నివారణల చర్యలో భాగంగా పలు ఆంక్షలను విధించింది. ఈ నేపధ్యంలో ఒడిశా(Odisha)లో కోవిడ్ -19(COvie-19) కేసుల భారీగాస్ నమోదు అవుతుండడంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలను జనవరి 10 న మూసివేశారు. అయితే ఓ వైపు కొత్త వేరియంట్ లక్షణాలు సాధారణంగా ఉండడం.. బూస్టర్ డోసు వంటివాటితో పాటు ప్రజలలో కరోనా పై పెరిగిన అవగాహనతో మళ్ళీ ఇప్పుడిప్పుడే ఒకొక్కటిగా ఆలయాలు తెరుచుకుంటున్నాయి. తాజాగా ఒడిశాలోని ప్రముఖ పురాతన ఆలయం పూరి జగన్నాథుడి ఆలయం తెరుచుకోనుంది. 21 రోజుల తర్వాత జగన్నాధుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి ఆలయాన్ని తెరవనున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులు స్వామివారి దర్శించుకోవచ్చు అని పూరి కలెక్టర్ సమత్ వర్మ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ రాష్ట్రంలోని ఆలయాలను తెరవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే పూరి ఆలయాన్ని ప్రతీ ఆదివారం ముసివేస్తామని.. అప్పుడు ఆలయాన్ని పరిశుభ్రం చేస్తామని తెలిపారు.

పూరి జగన్నాధుడుని దర్శించుకోవాలనుకునే భక్తులకు కొన్ని సూచనలు చేశారు. స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పని సరిగా డబుల్ డోస్ టీకా సర్టిఫికేట్ లేదా RT-PCR పరీక్ష నివేదిక (ప్రవేశానికి 72 గంటల ముందు) తీసుకుని రావాల్సి ఉంటుంది చెప్పారు. లేదంటే ఆలయంలోకి అనుమతినివ్వమని కలెక్టర్ సమత్ వర్మ స్పష్టం చేశారు. ఆలయంలోకి స్థానిక భక్తులు పడమర ద్వారం రావాల్సి ఉంటుందని.. అదే ఇతర ప్రదేశాల నుంచి వచ్చే భక్తులు తూర్పు ద్వారం గుండా ప్రవేశించాల్సి ఉంటుంది సూచించారు.

Also Read:

ఈ వారంలో ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్.. ఈ వారం ఏ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..