Putrada Ekadashi: సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇచ్చే పుత్రదా ఏకాదశి తేదీ, పూజా శుభసమయం ఎప్పుడంటే..

పుత్రద ఏకాదశి ఉపవాసం ఏకాదశి ఉపవాసాలలో ముఖ్యమైన ఉపవాసం. ఈ ఉపవాసం ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆచరించబడుతుంది. శ్రావణ మాసం లో శుద్ధ పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి లేదా పవిత్రోపన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజున సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉపవాశం ఉండి శ్రీ మహా విష్ణువుని పూజించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. ఈ ఏకాదశి విశిష్టతను స్వయంగా శ్రీ కృష్ణుడు ధర్మరాజుకి చెప్పినట్లు పురాణ కథ. ఈ ఏడాది శ్రావణ పుత్రద ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజ వీధి, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..

Putrada Ekadashi: సంతానం లేని దంపతులకు సంతానాన్ని ఇచ్చే పుత్రదా ఏకాదశి  తేదీ, పూజా శుభసమయం ఎప్పుడంటే..
Putrada Ekadashi 2025

Updated on: Aug 01, 2025 | 10:35 AM

హిందూ మతంలో ప్రతి ఉపవాసానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. ఏకాదశి ఉపవాసం శ్రీ మహా విష్ణువుకు అంకితం చేయబడింది. శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రద ఏకాదశి అంటారు. పుత్రద ఏకాదశి ఉపవాసం సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది. శ్రావణ మాసంలో మొదటిది. పుష్య మాసంలో రెండవది. ఈ రెండు ఏకాదశి ఉపవాసాలు సంతానం కోసం ఆచరిస్తారు. 2025 సంవత్సరంలో శ్రావణ పుత్రద ఏకాదశి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఏకాదశి ప్రాముఖ్యత పూజా విధి గురించి తెలుసుకోండి

శ్రావణ పుత్రదా ఏకాదశి 2025 తిథి

ఏకాదశి తిథి ఆగస్టు 04, 2025 ఉదయం 11:41 గంటలకు ప్రారంభమవుతుంది. ఏకాదశి తిథి 05 ఆగస్టు 2025 మధ్యాహ్నం 01:12 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం పుత్రద ఏకాదశి ఉపవాసం ఆగస్టు 5, మంగళవారం నాడు పాటించబడుతుంది.

పుత్రదా ఏకాదశి ప్రాముఖ్యత

జీవితంలో పుత్ర ఆనందం లభించని దంపతులు చాలా బాధపడతారు. పుత్ర ఆనందం పొందడానికి పుత్ర ఏకాదశి ఉపవాసం ఆచరిస్తారు. పుత్ర ఏకాదశి ఉపవాసం కుమారుడు లేని దంపతులకు చాలా ముఖ్యం. సంతానం లేని దంపతులు పుత్ర ఏకాదశి ఉపవాసం ఆచరించి కొడుకును పొందవచ్చు. అలాగే సంతానం కూడా కలుగుతుంది. ఈ ఉపవాసం పాటించడం ద్వారా ప్రతి కోరిక నెరవేరుతుంది. మోక్షం కూడా లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

పుత్రదా ఏకాదశి 2025 పూజ విధి

  1. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని, స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించండి.
  2. ఇంట్లోని పూజ స్థలాన్ని శుభ్రం చేసి, గంగా జలాన్ని చల్లి శుద్ధి చేయండి.
  3. విష్ణువు విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించండి.
  4. స్టూల్ మీద పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని పరచండి.
  5. శ్రీ మహా విష్ణువుకు గంగాజలం, పంచామృతంతో స్నానం చేయండి.
  6. పసుపు గంధం, పువ్వులు, పూలమాల, తులసి దళాలను సమర్పించండి.
  7. నెయ్యి దీపం వెలిగించి, విష్ణువుకు పండ్లు, స్వీట్లను సమర్పించండి.
  8. విష్ణు చాలీసా పఠించి చివరిగా హారతిని ఇవ్వండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.