Navaratri: నవరాత్రులలో నాల్గవ రోజు కూష్మాండ ఆరాధన, విధానం, నైవేద్యం, మంత్రం, ప్రాముఖ్యత ఏమిటంటే

|

Oct 05, 2024 | 7:35 PM

దేవీ నవరాత్రుల్లో నాల్గవ రోజున కూష్మాండ దేవిని ( చంద్రఘంటా ) పూజిస్తారు. తల్లి కూష్మాండ దేవి సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె కాంతి కారణంగా అన్ని దిశలలో కాంతి ఉంటుంది. ఏ ఇతర దేవత కూష్మాండ దేవి శక్తిని, ప్రభావాన్ని తట్టుకోలేడు. కూష్మాండ ఎనిమిది చేతులతో కూడిన దేవత. ఆమె ఏడు చేతులలో కమండలు, విల్లు, బాణం, తామరపువ్వు, మకరందంతో నిండిన కుండ, చక్రం, గదా కలిగి ఉన్నాయి. ఎనిమిదవ చేతిలో విజయాలు, సంపదలను ఇచ్చే జపమాల ఉంటుంది.

Navaratri: నవరాత్రులలో నాల్గవ రోజు కూష్మాండ ఆరాధన, విధానం, నైవేద్యం, మంత్రం, ప్రాముఖ్యత ఏమిటంటే
Kushmanda Devi
Follow us on

దేవీ నవరాత్రుల్లో నాల్గవ రోజున కూష్మాండ దేవిని ( చంద్రఘంటా ) పూజిస్తారు. తల్లి కూష్మాండ దేవి సూర్యుని వలె ప్రకాశవంతంగా ఉంటుంది. ఆమె కాంతి కారణంగా అన్ని దిశలలో కాంతి ఉంటుంది. ఏ ఇతర దేవత కూష్మాండ దేవి శక్తిని, ప్రభావాన్ని తట్టుకోలేడు. కూష్మాండ ఎనిమిది చేతులతో కూడిన దేవత. ఆమె ఏడు చేతులలో కమండలు, విల్లు, బాణం, తామరపువ్వు, మకరందంతో నిండిన కుండ, చక్రం, గదా కలిగి ఉన్నాయి. ఎనిమిదవ చేతిలో విజయాలు, సంపదలను ఇచ్చే జపమాల ఉంటుంది. సింహం కూష్మాండ దేవి వాహనం. కూష్మాండను ఆరాధించడం వల్ల మనిషి తెలివితేటలు, జ్ఞానం పెరుగుతాయని నమ్ముతారు.

కూష్మాండ దేవి ఆరాధన శుభ సమయం

వేద పంచాంగం ప్రకారం కూష్మాండ దేవిని పూజించడానికి ఉదయం 11:40 నుంచి 12:25 వరకు అనుకూలమైన సమయం ఉంటుంది.

కూష్మాండ దేవి పూజా విధానం

కూష్మాండ దేవిని పూజించడానికి ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పూజా గదిని అలంకరించండి. ఆ తర్వాత కూష్మాండ దేవిని ధ్యానించి కుంకుమ, అక్షతలు, ఎరుపు రంగు పూలు, పండ్లు, తమలపాకులు, పుసుపు వంటి అలంకరణ వస్తువులను భక్తితో సమర్పించండి. అలాగే తెల్ల గుమ్మడికాయ లేదా దాని పువ్వులు ఉంటే వాటిని మాతృ దేవతకు (కూష్మాండ దేవి) సమర్పించండి. తరువాత దుర్గా చాలీసా పఠించి, చివరగా నెయ్యి దీపం లేదా కర్పూర హారతిని కూష్మాండ దేవికి ఇవ్వండి.

ఇవి కూడా చదవండి

కూష్మాండ దేవికి సమర్పించాల్సిన నైవేద్యాలు

కూష్మాండ దేవికి కోవా అంటే ఇష్టం. కనుక అమ్మవారి పూజలో కోవాను సమర్పించాలి. అంతేకాదు కూష్మాండ దేవికి కోవా స్వీట్లతో పాటు వివిధ రకాల స్వీట్స్ ని సమర్పించవచ్చు. అంతేకాదు హల్వా, తీపి పెరుగు లేదా మాల్పువాలను ప్రసాదం అందించాలి. పూజ అనంతరం కూష్మాండ దేవికి సమరిమ్చిన నైవేద్యాన్ని ప్రసాదాన్ని తీసుకుని అదే సమయంలో ఇతరులకు కూడా అందించండి.

మా కూష్మాండ పూజ మంత్రం (మా చంద్రఘంట పూజ మంత్రం)

ఓం దేవీ కూష్మాండా యై నమః ఓం దేవీ కూష్మాండా యై నమః సురాసంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవ్ చ దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండ శుభదాస్తు మే మాం

కూష్మాండ పూజ ప్రాముఖ్యత (మా చంద్రఘంట ప్రాముఖ్యత)

కూష్మాండ దేవిని పూజించడం వల్ల కుటుంబానికి సుఖ సంతోషాలు లభిస్తాయని, కష్టాల నుంచి తల్లిని రక్షిస్తారని నమ్ముతారు. పెళ్లికాని యువతులు భక్తిశ్రద్ధలతో మాతృమూర్తిని పూజిస్తే వారికి నచ్చిన వరుడు లభించడంతో పాటు వివాహితలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది. అంతే కాదు కూష్మాండ దేవి తన భక్తులను రోగాలు, దుఃఖం, వినాశనం నుండి విముక్తి చేస్తుంది. ఆయుర్దాయం, కీర్తి, బలం, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి