Tirumala Sarvadarshanam: తిరుమల కొండకు పోటెత్తిన భక్తజనం.. ప్రారంభమైన శ్రీవారి సర్వదర్శనం..

|

Sep 08, 2021 | 8:48 AM

తిరుమలలో ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు.

Tirumala Sarvadarshanam: తిరుమల కొండకు పోటెత్తిన భక్తజనం.. ప్రారంభమైన శ్రీవారి సర్వదర్శనం..
Free Darshan Started In Tir
Follow us on

ఐదు నెలల తర్వాత తిరుమలలో ఉచిత దర్శనాలు ప్రారంభమయ్యాయి. తాజాగా సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అయితే ఇవాళ చిత్తూరు జిల్లావాసులకే టోకెన్లను పరిమితం చేశారు. అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో రోజుకు 2 వేల టోకెన్లు ఇచ్చేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో అఖిలాండ బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు చిత్తూరు జిల్లా భక్తులు పోటీపడుతున్నారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాదిన్నరగా శ్రీవారి సర్వదర్శనాన్ని టీటీడీ నిలిపివేసింది. ప్రస్తుతం ప్రత్యేక ప్రవేశదర్శన టోకెన్లను మాత్రమే టీటీడీ జారీ చేస్తోంది.

ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20వేల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఒక కౌంటర్ లో మాత్రమే టిక్కెట్లను జారీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన స్థానిక భక్తులకు మాత్రమే సర్వదర్శన టిక్కెట్లను జారీ చేస్తున్నారు.

ప్రస్తుతం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వ దర్శనం టోకెన్లను ఇవ్వనుండగా.. త్వరలోనే మిగతా జిల్లాల వారికి కూడా టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు రూ. 300 స్పెషల్ దర్శనం టికెట్లు ఉన్నవారిని, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను మాత్రమే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తూ వస్తోంది.

ఇవి కూడా చదవడి: Police: రక్షణ కల్పించడంలోనే కాదు.. కష్టాల్లోనూ మేమున్నామన్నారు.. ముంచెత్తే వరదల్లో చేయి అందించి సాయం చేశారు..

Rahul Murder: రాహుల్ హత్యకు ముందు ఏం జరిగింది.. ఎవరు ఎవరితో సహకరించారు.. మరింత కూపీలాగుతున్న పోలీసులు