Sankranti: మకర సంక్రాంతి రోజున ఏ నువ్వులు దానం చేయాలి? నలుపా లేదా తెలుపా తెలుసుకోండి

|

Jan 04, 2024 | 1:19 PM

మకర సంక్రాంతి రోజున చేసే దానం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున చేసే దానాలకు  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తమ శక్తి మేరకు దానం చేస్తారు. మంచి పనులను చేస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున చేసే దానాలలో.. నువ్వులు దానానికి విశిష్ట స్థానం ఉంది. మకర సంక్రాంతి రోజున  నువ్వులను దానం చేయడంలో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి రోజున చేసే స్నానం , దానం వలన ఫలితాలు చాలా రెట్లు పెరుగుతాయని.. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు.

Sankranti: మకర సంక్రాంతి రోజున ఏ నువ్వులు దానం చేయాలి? నలుపా లేదా తెలుపా తెలుసుకోండి
Makara Sankranti
Follow us on

హిందువుల పండగల్లో అతి పెద్ద పండగల్లో మకర సంక్రాంతికి ఒకటి. మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజులు ఈ పండగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి రోజున సూర్య భగవానుడు ఉత్తర దిశలో సంచరిస్తాడు. మకర సంక్రాంతి రోజు నుండి ఖర్మాలు ముగిసి శుభ కార్యాలు ప్రారంభమవుతాయి. మకర సంక్రాంతి రోజున చేసే దానం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున చేసే దానాలకు  ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున తమ శక్తి మేరకు దానం చేస్తారు. మంచి పనులను చేస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజున చేసే దానాలలో.. నువ్వులు దానానికి విశిష్ట స్థానం ఉంది. మకర సంక్రాంతి రోజున  నువ్వులను దానం చేయడంలో విశిష్టత ఉంది.

మకర సంక్రాంతి రోజున చేసే స్నానం , దానం వలన ఫలితాలు చాలా రెట్లు పెరుగుతాయని.. జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. అందువల్ల మకర సంక్రాంతి రోజున పవిత్ర నదులలో స్నానం చేసి, పూజలు చేసి, దానధర్మాలను  చేస్తారు. ఈ దానంలో నువ్వులకు విశేష ప్రాధాన్యత ఉంది.

ఏ నువ్వులు దానం చేయాలంటే

నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని రెండు రకాలు ఉన్నాయి. చాలా మంది మకర సంక్రాంతి రోజున తెల్ల నువ్వులను దానం చేస్తారు. నమ్మకాల ప్రకారం మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయాలి.

ఇవి కూడా చదవండి

నల్ల నువ్వులు శని దేవుడికి సంబంధించినవిగా భావిస్తారు. శనిదేవుడు సూర్య భగవానుని కుమారుడు. కాబట్టి, ఈ ఇద్దరు దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి నల్ల నువ్వులను నీటిలో వేసి, ఆ నీటిని సూర్య భగవానుడికి ఆర్ఘ్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడి ఆశీస్సులు, శని దేవుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

తెల్ల నువ్వుల దానం

నిజానికి..  నల్ల నువ్వులను మకర సంక్రాంతి నాడు చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ నల్ల నువ్వులు లేని పక్షంలో తెల్ల నువ్వులను కూడా దానం చేయవచ్చు. తెల్ల నువ్వులు సూర్య భగవానుడికి సంబంధించినవిగా పరిగణించబడుతున్నాయి. అందువల్ల ఈ రోజున తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు