Veerabrahmendra swami muth : ఏపీ ఎమ్మెల్యే vs కర్ణాటక ఎమ్మెల్యేగా టర్న్ తీసుకున్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతి వివాదంలో అనేక మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఇది కడప ఏపీ ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక ఎమ్మెల్యే..

Veerabrahmendra swami muth : ఏపీ ఎమ్మెల్యే vs కర్ణాటక ఎమ్మెల్యేగా టర్న్ తీసుకున్న బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం
Sri Potuluri Veerabrahmamgari Matam

Updated on: Jun 26, 2021 | 3:09 PM

Sri Potuluri Veerabrahmendra swami vari muth : కడప జిల్లాలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం పీఠాధిపతి వివాదం అనేక మలుపులు తీసుకుంటోంది. తాజాగా ఇది ఏపీ ఎమ్మెల్యే వర్సెస్ కర్ణాటక ఎమ్మెల్యే అన్నట్టుగా సరికొత్త టర్న్ తీసుకుంది. ఇప్పుడు బ్రహ్మం గారి మఠం వివాదంలోకి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే గాలి కరుణాకరరెడ్డి ఎంటరయ్యారు. వీరభోగ వేంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతీ లక్షమ్మకు అండగా గాలి కరుణాకరరెడ్డి నిలబడినట్టు సమాచారం. గాలి కరుణాకరరెడ్డి తో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటుని ఇవాళ్టి నాటకీయ పరిణామాల మధ్య మారుతీ లక్షమ్మ ప్రకటించారు.

గాలి జనార్ధనరెడ్డి, గాలి కరుణాకరరెడ్డి ఇద్దరూ బ్రహ్మంగారి భక్తులేనని మారుతీ లక్ష్మమ్మ వెల్లడించారు. ఇదిలాఉండగా, మరోవైపు మొదటిభార్య పెద్దకొడుక్కి అండగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నిలుస్తున్నారు. ఈ సాయంత్రం పీఠాధిపతిగా వెంకటాద్రిని ప్రకటిస్తామని ఇప్పటికే థఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రకటించారు. అయితే, రఘురామిరెడ్డి తీరుని నిరశించిన మారుతీ లక్ష్మమ్మ మైదుకూరు ఎమ్మెల్యే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక ఎమ్మెల్యే మద్దతు కోరడంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది.

ఇలా ఉండగా, బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. పీఠాధిపతి ఎంపికలో ఇంకా స్పష్టత రాలేదు. పీఠాధిపతులతో పాటు, రాష్ట్ర దేవాదాయ శాఖ రంగంలోకి దిగి సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరువర్గాలు మెట్టు దిగడం లేదు. స్థానిక పెద్దలతోపాటు కొందరు మండల స్థాయి నాయకులు శివైక్యం చెందిన వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి కుటుంబసభ్యుల మధ్య చర్చలు జరిపి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా దివంగత పీఠాధిపతి పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామిని ఎంపిక చేశారు. ఉత్తరాధికారిగా రెండవ కుమారుడు వీరభద్ర స్వామిని ఎంపిక చేశారు. భవిష్యత్ వారసులుగా రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ కుమారుల్లో ఒకరిని పీఠాధిపతిగా నియమించాలని నిర్ణయించారు.

పీఠాధిపతి నియామకంపై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఈ (శుక్రవారం) ఉదయం నుంచి ఇరు కుటుంబాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అందరూ ఒక అంగీకారానికి వచ్చారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రకటించారు. కందిమల్లయ్యపల్లి సంస్థానంపుర ప్రజల సహకారంతో పీఠాధిపతి ఎంపిక జరిగింది. ఈ నిర్ణయాన్ని శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో పెద్దలు ప్రకటిస్తారు.. త్వరలో పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరగనుందని తెలిపారు. మరోసారి పెద్ద భార్య కుటుంబ సభ్యులు, రెండో భార్య మారుతి మహాలక్ష్మి తో కూర్చొని మాట్లాడుకుని సాయంత్రం 4 గంటలకు పీఠాధిపతి ఎవరనేది కుటుంబ సభ్యులు అంతా కలిసి అధికారికంగా ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. పీఠాధిపతి పట్టాభిషేకం మఠంలోని ఆస్థాన పురోహితుల నిర్ణయ తేదీ ప్రకారం ప్రకటిస్తామన్నారు.

ఇదిలావుంటే, బ్రహ్మం గారి మఠం పీఠాధిపతి వివాదం కొలిక్కి వచ్చిందని వస్తున్న వార్తలు అవాస్తవమని వెంకటేశ్వర స్వామి రెండవ భార్య మారుతి మహాలక్ష్మి అన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తనతో ఇంతవరకూ చర్చించ లేదని మారుతి మహాలక్ష్మమ్మ వెల్లడించారు. ఇవాళ బ్రహ్మంగారి మఠంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద భార్య కుమారులైన వెంకటాద్రి వీరభద్రయ్యలు మాత్రమే ఎమ్మెల్యేతో సమావేశమయ్యారని ఆమె తెలిపారు. సాయంత్రం తనతో చర్చిస్తామని ఎమ్మెల్యే తెలిపారన్నారు. అయితే, నా కొడుకు గోవింద స్వామి తదుపరి పీఠాధిపతి కావాలనే మా ఉద్దేశ్యం.. స్వామి వారి చివరి కోరిక కూడా అదే అని మారుతీ లక్ష్మమ్మ స్పష్టం చేశారు.

Read also : Balka Suman : ఈటల లేఖ నకిలీదని బండి సంజయ్.. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ప్రమాణం చేయాలి : బాల్కా సుమన్