AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమ, కోపం.. M అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..?

Names starting with M personality: పేరులో మొదటి అక్షరం M తో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలు, వారి బలాలు, బలహీనతలు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం. ఆంగ్ల అక్షరం M.. సంఖ్య 4కి దగ్గరగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో 4 సంఖ్య ధైర్యం, తెలివితేటలు, కృషిని గురించి తెలియజేస్తుంది. M అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు.

ప్రేమ, కోపం.. M అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా..?
M Letter
Rajashekher G
|

Updated on: Feb 03, 2026 | 3:44 PM

Share

M letter personality: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు, రాశులతోపాటు పేర్లకు కూడా ప్రాముఖ్యత ఉంది. శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం శక్తి వారి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం శుభ లేదా అశుభ ప్రభావాలకు కూడా కారకంగా ఉంటుంది. అందుకే పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి వ్యక్తి స్వభావాన్ని నిర్ధారిస్తారు. ఇప్పుడు పేరులో మొదటి అక్షరం M తో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలు, వారి బలాలు, బలహీనతలు, స్వభావం, వ్యక్తిత్వాన్ని తెలుసుకుందాం. ఆంగ్ల అక్షరం M.. సంఖ్య 4కి దగ్గరగా పరిగణించబడుతుంది.

కోపిష్టులే కానీ..

జ్యోతిష్య శాస్త్రంలో 4 సంఖ్య ధైర్యం, తెలివితేటలు, కృషిని గురించి తెలియజేస్తుంది. M అక్షరంతో ప్రారంభమయ్యే పేరు ఉన్న వ్యక్తులు ఆకర్షణీయంగా ఉంటారు. వారు కొంచెం కోపిస్టులుగా ఉంటారు. ఇదే వారిలో ఉండే అతిపెద్ద బలహీనత. ఈ వ్యక్తులు చిన్న విషయాలను కూడా కోపంగా ఉంటారు. వీరంతా పుట్టుకతోనే నిర్భయులు. ప్రతి విషయంలోనూ అడుగున నిలబటానికి ఇష్టపడతారు. వారు స్వభావరీత్యా సిగ్గు ఎక్కువ కలవారు. మొండిగా ఉండటం ద్వారా పనులు పూర్తి చేయగలరు.

ఏదైనా ప్రారంభిస్తే..

‘M’ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు తమ కెరీర్‌లో మార్పు కోసం వేచి ఉండేందుకు బదులుగా దానిని తీసుకువస్తారు. వారు తమ పని గురించి గంభీరంగా ఉంటారు. బలమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు వీరు ఆచరణాత్మకంగా ఉంటారు. వీరి జీవితాలు పని చుట్టూ తిరుగుతాయి. ఏదైనా పని ప్రారంభించే ముందు దాని గురించిన ప్రణాళికలు వేసుకుంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని పూర్తి చేసిన తర్వాతే విశ్రాంతి తీసుకుంటారు.

ప్రేమలో నిజాయితీ..

‘M’ అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు తమ జీవిత భాగస్వాములకు విధేయులుగా ఉంటారు. వారు జీవితాంతం క్రమశిక్షణ, నిజాయితీ గల జీవితాన్ని గడుపుతారు. ఈ వ్యక్తులు సులభంగా ప్రేమలో పడరు కానీ.. ప్రేమలో పడిన తర్వాత మాత్రం వారు తమ భాగస్వామికి కట్టుబడి ఉంటారు. వీరు తమ ప్రియమైనవారు, స్నేహితుల కోసం పోరాడతారు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు, జ్యోతిష్య శాస్త్రం, మత సంబంధిత అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)