Nagula Chavithi: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా.? నాగుల చవితి రోజు ఇలా చేయండి..

ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వేడులకు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే నాగుల చవితి రోజు నాగ దేవతను ఆరాధిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. నాగుల చవితి నాడు ఉపవాసం ఉండి, పుట్టలో పాలు పోస్తుంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నాగుల చవితి రోజు పాలు పోయడం వల్ల ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు...

Nagula Chavithi: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారా.? నాగుల చవితి రోజు ఇలా చేయండి..
Nagula Chavithi

Updated on: Nov 16, 2023 | 7:25 PM

నాగుల చవితి వేడుకలు నిర్వహించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు శుక్రవారం నాగుల చవితి వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ వేడుకలకు ముస్తాబయ్యాయి. నాగదేవతను ఆరాధించి, తామ కోర్కేలు నేరవేర్చమని స్త్రీలు పుట్టలో పాలు పోయడం ఆనవాయితీతా వస్తోంది. ప్రతీఏటా మహిళలు పెద్ద ఎత్తున నాగుల చవితి వేడుకలకు హాజరవుంటారు.

ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా వేడులకు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే నాగుల చవితి రోజు నాగ దేవతను ఆరాధిస్తే ఎన్నో లాభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. నాగుల చవితి నాడు ఉపవాసం ఉండి, పుట్టలో పాలు పోస్తుంటారు. అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు నాగుల చవితి రోజు పాలు పోయడం వల్ల ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు. ఇక నాగదోషంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా ఈ రోజు తప్పక పుట్టలో పాలు పోస్తుంటారు.

నాగచవితి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తే నాగ దోష నివారణ పొందొచ్చు. నాగదోష నివారణ పూజలు చేయడం వల్ల నాగదోషాన్ని తొలగించుకోవచ్చు. ఇలా చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియడంతో పాటు, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఇక పుట్టలో పాలు పోయడంతో పాటు, చలివిడి, చిమిలి, వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వరాలు సిద్ధిస్తాయి. ఇక పుట్ట చుట్టూ బియ్యం లేదా రవ్వ పిండిని జల్లుతుంటారు. పుట్ట చుట్టూ ఉండే చీమలు వంటి వాటికి ఆహారం లాగా ఉపయోగపడుతుంది.

ఇక నాగుల చవితి గురించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. చవితి రోజు మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలను పూజించాలి. ఇలాంటి విగ్రహాలను అర్చిస్తే సర్వ రోగాలు తొలగిపోయి, ఆరోగ్యవంతులవుతారని భారతీయుల విశ్వాసం. అంతేకాకుండా ఈ రోజు నాగదేవతలను పంచామృతాలతో అభిషేకం చేయిస్తే.. సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజ చేయించడం శుభదాయకం. చెవి బాధలు, కంటిబాధలు ఉన్న వార చవితి రోజున నాగ దేవతలను పూజించి, ఉపవాసం ఉంటే ఉపశనం లభిస్తుందని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us