Paush Amavasya: పితృ దోషం, కాల సర్పదోషం నుంచి బయటపడేందుకు పుష్య అమావస్య శుభప్రదం.. ఈసారి ఏడాది వచ్చిందంటే..

|

Dec 24, 2021 | 8:58 AM

Paush Amavasya: హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి ప్రతి నెలలో కృష్ణ పక్షం చివరి రోజున వస్తుంది. దీని తరువాత శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో..

Paush Amavasya: పితృ దోషం, కాల సర్పదోషం నుంచి బయటపడేందుకు పుష్య అమావస్య శుభప్రదం.. ఈసారి ఏడాది వచ్చిందంటే..
Pushya Masam
Follow us on

Paush Amavasya: హిందూ క్యాలెండర్ ప్రకారం.. అమావాస్య తిథి ప్రతి నెలలో కృష్ణ పక్షం చివరి రోజున వస్తుంది. దీని తరువాత శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరంలో 2022 జనవరి 2న పుష్య మాసం అమావస్య వస్తుంది. గ్రంధాలలో అన్ని అమావస్యలను పూర్వీకులకు అంకితం చేసినప్పటికీ, పుష్య మాసం అమావస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే పుష్య మాసం అంతా పూర్వీకులకు అంకితమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో పూర్వీకుల పేరుతో దానం చేయడం వల్ల పూర్వీకులు భువి నుంచి నేరుగా వైకుంఠానికి వెళతారని ప్రతీతి. అప్పుడు తమ వారసులను ఆశీర్వదించి వెళతారు. అమావాస్యకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి.

అమావాస్య తిథి ప్రాముఖ్యత
అమావాస్య తిథి రోజున నదీస్నానం, పూజలు, జపం, తపస్సు చేయడం సర్వసాధారణం. అమావాస్య రోజున గంగానదిలో స్నానం చేయడం, పూజించడం వల్ల అననుకూల ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలలో చెప్పబడింది. అదే సమయంలో పూర్వీకుల కోసం దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతృప్తి చెంది శాంతిని పొందుతారు. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు అమావాస్య రోజున పవిత్ర నదులు , సరస్సులలో పవిత్ర స్నానాలు చేస్తారు. నువ్వుల తర్పణం ఇస్తారు.

పితృ దోషం, కాల సర్పదోషం నుండి బయటపడే రోజు
పితృ దోషం , కాల సర్ప దోషం నుండి బయటపడడానికి అమావాస్య తిథి శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున పూర్వీకులకు పిండప్రదానం చేయడం ద్వారా పెద్దలు మోక్షాన్ని పొందుతారు. తమ వారసులతో చాలా సంతోషంగా ఉండమని దీవిస్తారు. పూర్వీకుల ఆశీస్సులతో వారసులు సుఖ సంతోషంగా జీవిస్తారు. వారి జీవితంలో దేనికీ కొరత ఉండదు అని నమ్మకం.

శుభ సమయం
పుష్య మాసం అమావాస్య తేదీ: ఆదివారం, జనవరి 2, 2022
పుష్య మాసం ప్రారంభ తేదీ: 2 జనవరి 3 గంటల 43 నిమిషాలు
పుష్య మాసం చివరి తేదీ: జనవరి 3 సాయంత్రం 5 గంటలకు 26 నిమిషాలకు

చేయాల్సిన పనులు: 
అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. కనుక ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల సంతోషం కోసం కొన్ని పనులు చేయాలి

1. అమావాస్య రోజున శ్రీకృష్ణుని పూజించి, గీతా పఠనం చేయాలి.
2. పూర్వీకులను స్మరించుకోవడం, పేదలకు బట్టలు, ఆహారం మొదలైన వాటిని పంపిణీ చేయాలి.
3. రావి చెట్టుకి నీరు పోయడం, రావి చెట్టు క్రింద దీపం వెలిగించడం
4. వీలైతే అమావాస్య రోజున పీపల్ మొక్కను నాటడం..

Also Read:  వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి రైతుకి సెల్యూట్ చెప్పిన చిరు..