ముచ్చింతల్ (Muchhinthal)శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని(Statue of Equality) దర్శించుకునే భక్తులు, సందర్శకుల కోసం ప్రవేశ సమయాలను ప్రకటించారు నిర్వాహకులు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. బుధవారం సెలవు. వీకెండ్‌లో అంటే శని, ఆదివారాల్లో మాత్రం ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు సందర్శకులు.. శ్రీరామనగరాన్ని దర్శించవచ్చు. మార్చ్ 9వ తేదీ నుంచి ఈ టైమింగ్స్ అమల్లోకి వస్తాయి. శ్రీరామనగరంలో ఇటీవల 216 అడుగుల ఎత్తైన భగవద్ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకింతం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
అయితే ఇక్కడివచ్చేవారికి రుసుముల వివరాలను గత బుధవారం ప్రకటించారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ.75, పెద్దలకు రూ.150గా ప్రవేశ రుసుములు నిర్ణయించామన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితంగా అనుమతి కల్పిస్తామన్నారు.
సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలోని 120 కిలోల శ్రీరామానుజచార్యుల సువర్ణమూర్తి విగ్రహం దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్ అందాలను తాత్కాలికంగా నిలిపివేశారు. బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్‌ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటు సహా ఇతరత్రా సాంకేతిక పనుల పూర్తికి మరో వారం రోజులు పడుతుండడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు.
ఇవి కూడా చదవండి: Chicken Changezi Recipe: చికెన్ ఇలా వండితే.. మొత్తం మీరే తినేస్తారు.. ఎలా చేయాలో నేర్చుకోండి..