హిందువు దేవాలయాలకు వెళ్లే భక్తులకు సాంప్రదాయ దుస్తులు ధరించాలని అనే నిబంధనను క్రమంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో అమలు చేయడానికి అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పటికే దక్షిణాదిలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో డ్రెస్ కోడ్ అమల్లో ఉండగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లోని హపూర్ ఖతు శ్యామ్ ఆలయంలో డ్రెస్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇక నుంచి భక్తులు చిరిగిన జీన్స్, హాఫ్ ప్యాంటు, స్కర్టులు వంటి రెచ్చగొట్టే దుస్తులతో వెళితే, వారిని ఆలయంలోకి అనుమతించరు. ఆలయంలో స్వామివారి కోసం వెళ్లే భక్తులు ఇకపై తప్పని సరిగా డ్రెస్ కోడ్‌ను పాటించాలి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆలయ కమిటీ విడుదల చేసింది.
ఆలయ కమిటీ వారు ఆలయ గోడల మీద బోర్డు పెట్టి మరీ డ్రెస్ కోడ్ గురించి సూచనలను రాశారు. భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలని విజ్ఞప్తి చేశారు. భక్తుడు చిరిగిన జీన్స్ ధరించి ఆలయంలోకి అడుగు పెడితే దర్శనానికి అనుమతించబోమని.. హాఫ్‌ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్టులు, నైట్ షూట్, వంటి పొట్టి దుస్తులు ధరించి వచ్చే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇటువంటి దుస్తులు ధరించి ఆలయంపై వచ్చే వారు బయట నుండి మాత్రమే దర్శనం చేసుకోమని సూచించింది.
స్వాగతిస్తున్న భక్తులు
అదే సమయంలో ఆలయ కమిటీ నిర్ణయాన్ని పలువురు భక్తులు స్వాగతిస్తున్నారు. దేవాలయం విశ్వాసానికి కేంద్రమని నవీన్ గోయల్ అనే భక్తుడు చెప్పాడు. సాంప్రదాయ దుస్తులు ధరించిన వారు మాత్రమే ఆలయానికి వెళ్లాలనేది మంచి నిర్ణయమని తెలిపారు. ఈ ఏడాది మేలో ముజఫర్‌నగర్‌లోని ప్రసిద్ధ బాలాజీ ఆలయ కమిటీ కూడా భక్తులు ధరించే దుస్తుల విషయంలో మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆలయానికి వచ్చే భక్తులు హాఫ్ ప్యాంట్, బెర్ముడా, మినీ స్కర్ట్ వంటి దుస్తులు ధరించరాదని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).