Tirumala: తిరుమలకు వీఐపీల తాకిడీ.. శ్రీవారిని దర్శించుకున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు..

|

Jan 01, 2021 | 2:37 PM

Tirumala: నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. శుక్రవారం నాడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమల..

Tirumala: తిరుమలకు వీఐపీల తాకిడీ.. శ్రీవారిని దర్శించుకున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు..
Follow us on

Tirumala: నూతన సంవత్సరం ప్రారంభ సందర్భంగా తిరుమలకు వీఐపీల తాకిడి పెరిగింది. శుక్రవారం నాడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, తెలంగాణ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ డియోధర్, మహారాష్ట్ర మంత్రులు రాజేంద్ర నాథ్ సింగనే, సంజయ్ బన్సుడి, తమిళనాడు మంత్రి సంపత్, చెన్నై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గోవిందా రాజులు, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ముమ్మీడివరం ఎమ్మెల్యే పోన్నడా సతీష్ కూమార్, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు, నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్, మ్యూజిక్ డైరెక్టర్లు తమన్, కోటి ఉన్నారు. వీరికి ఆలయాధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనం అనంతరం ఆలయం ముందు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వద్ద ప్రముఖులందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

 

Also read:

TRS vs BJP: బీజేపీకి అంత సీన్ లేదు.. బండి సంజయ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..

కార్మికులకు, చిరు ఉద్యోగులకు శుభవార్త.. తీర్థయాత్రలు చేసేందుకు ప్రభుత్వ సాయం.. ఆ రాష్ట్రం వారికి మాత్రమే..!