రామతీర్థంలో కొలువుదీరిన సీతారామ లక్ష్మణులు.. వైభవోపేతంగా కొత్త విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం

|

Jan 28, 2021 | 11:55 AM

రామతీర్థంలో సీతారామ లక్ష్మణులు కొలువుదీరారు. నూతన బాలాలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. ఆగమ శాస్త్రోక్తంగా వేదపండితులు.. విగ్రహాలను ప్రతిష్టింపచేశారు. అందులో భాగంగా గత నాలుగురోజులుగా...

రామతీర్థంలో కొలువుదీరిన సీతారామ లక్ష్మణులు.. వైభవోపేతంగా కొత్త విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం
Follow us on

Ramatheertham Temple : రామతీర్థంలో సీతారామ లక్ష్మణులు కొలువుదీరారు. నూతన బాలాలయంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించారు. ఆగమ శాస్త్రోక్తంగా వేదపండితులు.. విగ్రహాలను ప్రతిష్టింపచేశారు. అందులో భాగంగా గత నాలుగురోజులుగా ఉదయం, సాయంత్రం విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.

అంకురార్పణతో ప్రారంభమైన ప్రతిష్ట కార్యక్రమం.. క్షిరాధివాసం, జలదివాసం, ధాన్యాదివాసం, అష్ట కలశ స్నపనం, పంచగవ్యంతో పాటు ఇతర పూజాలను నిర్వహించి.. పూర్ణాహుతితో సేవా కార్యక్రమాలను ముగించారు. తర్వాత ఉదయం 8.58 గంటల శుభముహూర్తాన సీతారామ లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించారు.

రేపటి నుండి ఏకాంతంగా స్వామి వారి పూజా కైంకర్యాలు సాగనున్నాయి. ఈ మొత్తం పూజా కైంకర్యాలను పదహారు మంది రుత్వికులు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వైదిక వర్సిటీ ప్రొఫెసర్‌ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలోని శిష్యబృందం పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు కూడా ఈ ప్రతిష్టాపనలో పాలుపంచుకున్నారు.