Vinayaka Chavithi In Nellore: ఓ వైపు ఏపీ సర్కార్ కరోనా నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి జరుపుకోవడానికి అనుమతులు లేవు అని చెప్పిన సంగతి తెలిసిందే.. దీంతో ఏపీ ప్రభుత్వం తీరుని నిరసిస్తూ.. కొంతమంది హైకోర్టు మెట్లు ఎక్కిమరీ కరోనా నిబంధనలు పాటిస్తూ వినాయక వేడుకలను జరుపుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
గూడూరు లోని నాలజలమ్మ వీధిలో వినాయక విగ్రహం కోసం చిన్నారుల ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసుల అనుమతులు తప్పని సరి అని తెలియడంతో.. ఆ ఇద్దరు చిన్నారులు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి వేడుకలను జరుపుకుంటాం.. అనుమతి ఇవ్వమని గూడూరు పోలీసులను అడిగారు. తాము కరోనా నిబంధనలు పాటిస్తూ.. వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే చిన్నారుల విజ్ఞప్తిపై స్పందించిన పోలీసులు పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పారు. అయితే ప్రవేటు స్థలంలో ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు.
దీంతో ఆ ఇద్దరు చిన్నారులు సంతోషపడుతూ.. తాము రెండేళ్లుగా వినాయక చవితి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఉత్సవాలను జరుపుకున్నామని.. ఈ ఏడాది కూడా మండపం ఏర్పాటు చేసి విగ్రహం ప్రతిష్టించి చవితి పండగను జరుపుకోవాలనుకున్నామని.. చెప్పారు. అందుకనే పోలీసుల అనుమతి తీసుకున్నామని.. వినాయక చవితి రోజున గణేషుడిని పూజిస్తే.. చదువు బాగా వస్తుందని చెబుతున్నారు ఈ చిన్నారులు.
Vinayaka Chaviti : చర్చి లోపలికి వినాయక విగ్రహాన్ని తీసుకుని రమ్మని కోరిన మత పెద్దలు.. గణేషుడిని కీర్తిస్తూ ప్రార్ధనలు ఎక్కడంటే..