Dussehra: దసరా నవ రాత్రుల్లో మొదటి సారి ఉపవాస దీక్షను చేపడుతున్నారా.. పూజ, ముఖ్యమైన నియమాలు మీకోసం ,

|

Oct 07, 2023 | 9:10 AM

దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి  ఈ 09 రోజుల్లో ప్రతి రోజుని అమ్మవారి భక్తులు పూర్తి ఆచారాలతో నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాస దీక్షను పాటిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం నవరాత్రి వ్రతం పాటించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి నవరాత్రి పూజకు  సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈ రోజు నవరాత్రి వ్రతానికి సంబంధించిన 09 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

Dussehra: దసరా నవ రాత్రుల్లో మొదటి సారి ఉపవాస దీక్షను చేపడుతున్నారా.. పూజ, ముఖ్యమైన నియమాలు మీకోసం ,
Dussehra Durga Puja
Follow us on

సనాతన హిందూ సంప్రదాయంలో శక్తి సాధన అన్ని దుఃఖాలను తొలగించి, కోరికలను నెరవేర్చడానికి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుండి 24 వరకు శక్తిని పూజిస్తారు. నవరాత్రులుగా 09 రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి  ఈ 09 రోజుల్లో ప్రతి రోజుని అమ్మవారి భక్తులు పూర్తి ఆచారాలతో నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాస దీక్షను పాటిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం నవరాత్రి వ్రతం పాటించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి నవరాత్రి పూజకు  సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈ రోజు నవరాత్రి వ్రతానికి సంబంధించిన 09 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

  1. మీరు నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటే, ముందుగా శరీరం, మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. ప్రతిపాద తిథి శుభ సమయంలో ఉపవాస దీక్షను చేపట్టండి.
  2. మీరు 9 రోజులు రోజంతా ఉపవాసం ఉండలేకపోతే.. మీ సౌలభ్యం ప్రకారం.. మీరు నవరాత్రుల మొదటి రోజు అదే విధంగా చివరి రోజున ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించవచ్చు
  3. శక్తి ఆరాధన, ఉపవాసం దీక్ష చేపట్టిన అనంతరం నవరాత్రి మొదటి రోజున ఒక శుభ సమయంలో సాధకుని మార్గదర్శకత్వంలో కలశాన్ని స్థాపించి, పవిత్రమైన నేలలో విత్తనాలను నాటండి.
  4. నవరాత్రులలో ఉపవాసం ఉండే భక్తులు తమ ఇంటికి ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తరం వైపున కూర్చుని అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. నవరాత్రులలో  దుర్గా దేవిని ఎల్లప్పుడూ ఆసనంపై కూర్చొని పూజించాలి. శక్తి సాధన కోసం ఎరుపు రంగు ఉన్ని పీఠం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దుర్గాదేవిని పొరపాటున కూడా నేలపై ఏర్పాటు చేసి  పూజించకండి.
  7. నవరాత్రులలో ఉపవాసం దీక్షను చేపట్టిన భక్తుడు నవరాత్రుల్లో చివరి రోజున దుర్గాదేవి స్వరూపంగా భావించే అమ్మాయిని పూజించాలి. నవరాత్రి ఉత్సవాలలో శక్తి సాధనలో 2 సంవత్సరాల నుండి 09 సంవత్సరాల మధ్య బాలికలను పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
  8. నవరాత్రులలో ఉపవాసం ఉండే వారు తామసమైన ఆహారాన్ని తినకూడదు. అదేవిధంగా దేవి సాధన కోసం చేపట్టిన ఉపవాస సమయంలో సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి.
  9. నవరాత్రులలో అమ్మవారిని పూజించే భక్తులు వ్రత సమయంలో పొరపాటున కూడా ఎవరినీ విమర్శించకూడదు. ఎవరిని అవమానించకూడదు. ఒకరిని ఇబ్బంది పడే విధంగా కబుర్లు చెప్పకూడదు,
  10. నవరాత్రులలో 09 రోజులు దుర్గాదేవి ఉపవాసం ఉండబోతున్నట్లయితే..  ఈ 09 రోజులలో మీ జుట్టు, గోళ్ళను కత్తిరించవద్దు. నవరాత్రి ఉపవాసం పాటించే భక్తుడు తన శక్తి మేరకు ఉపవాసం పాటించాలి. ఉపవాస సమయంలో ఆహారానికి బదులుగా పండ్లు తీసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.