Navaratri 2022: మీ జాతకంలో గ్రహ దోషం ఉందా? నవరాత్రుల్లో ఏ దేవతను పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసా..

|

Sep 22, 2022 | 4:11 PM

అమ్మవారిని కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే.. జాతకానికి సంబంధించిన గ్రహబాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. జాతకం ప్రకారం ఏ గ్రాహం వారు ఏ అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తే.. శుభ ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.

Navaratri 2022: మీ జాతకంలో గ్రహ దోషం ఉందా? నవరాత్రుల్లో ఏ దేవతను పూజిస్తే ఫలితం ఉంటుందో తెలుసా..
Navaratri Durga Puja
Follow us on

Navaratri 2022: హిందూ మతంలో పండగలకు ప్రత్యేక స్థానం ఉంది. పవిత్రమైన నవరాత్రి పర్వదినం రోజుల్లో శక్తి ఆరాధన ముఖ్యమైన స్థానం ఉంది. ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రుల తొమ్మిది రోజుల్లో దుర్గాదేవిని తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. సనాతన సంప్రదాయంలో దుర్గా దేవి వివిధ రూపాలను పూజించడం వివిధ ఫలాలను ఇస్తుందని సాధకుల నమ్మకం. నవరాత్రి తొమ్మిది రోజుల్లో 9 శక్తి రూపాలతో సాధకుని 9 రకాల కోరికలు నెరవేరడమే కాకుండా 9 గ్రహాల దోషాలు కూడా తొలగిపోతాయి. ఈ విధంగా నవరాత్రి మహా పర్వదినాన 9 రోజుల పాటు అమ్మవారికి హిందూ సనాతన ధర్మం ప్రకారం పూజలను చేస్తారు. అయితే అమ్మవారిని కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే..  జాతకానికి సంబంధించిన గ్రహబాధలు తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. జాతకం ప్రకారం ఏ గ్రాహం వారు ఏ అమ్మవారిని ఏ రూపంలో పూజిస్తే.. శుభ ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం.

మీ జాతకంలో తొమ్మిది గ్రహాలకు రాజుగా సూర్యుడిని భావిస్తారు. సూర్య బలం మీ జాతకంలో బలహీనంగా ఉండి మీకు ఇబ్బంది కలిగిస్తుంటే.. మీరు  అమ్మవారి రూపమైన శైలపుత్రిని పూజించండి. ఐశ్వర్యాన్ని పొందడానికి నవరాత్రుల మొదటి రోజున నియమానుసారం పూజించాలి.

మీ జాతకంలో బుద్ధి కారకంగా పరిగణించబడే చంద్రునికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. ఆ దోషాన్ని తొలగించుకోవడానికి, నవరాత్రుల్లో నాల్గవ రోజున ఆచారాల నియమాలతో కూష్మాండ దేవిని పూజించండి.

ఇవి కూడా చదవండి

ఎవరి జాతకం అశుభాలు గోచరిస్తుంటే.. కుజుడి అనుగ్రహం కోసం నవరాత్రుల్లో ఐదవ రోజున స్కందమాతా దేవిని పూజించాలి. దుర్గాదేవి ఈ పవిత్ర రూపాన్ని పూజించి, మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన జాతకంలో కుజుడు శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తారనినమ్మకం.

ఒక వ్యక్తి తన జాతకంలో బుధ గ్రహానికి సంబంధించిన దోషాలను కలిగి ఉంటే, అతను అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే..  వాటిని తొలగించుకోవడానికి ఆ వ్యక్తి నవరాత్రి ఆరవ రోజున కాత్యాయని అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతిని అదృష్ట కారకంగా పరిగణిస్తారు. బృహస్పతి గ్రహం సంబంధం ఉన్న దోషాలను తొలగించడానికి నవరాత్రి ఎనిమిదవ రోజున మహాగౌరి అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి.

జీవితంలో అన్ని రకాల ఆనందాలను, శోభలను ఇచ్చే శుక్రు దోషాలున్నవారు .. శుభఫలితాలు పొందడం కోసం నవరాత్రుల్లో తొమ్మిదవ రోజున.. సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించాలి. దీంతో శుక్ర దోషం తొలగి.. శుభఫలితాలు పొందుతారు.

ఎవరి జాతకంలో శని దోషం ఉందో.. అటువంటి వారు శనీశ్వరుడిని శాంతింపజేయడానికి, శని సంబంధం ఉన్న దోషాలను తొలగించడానికి.. నవరాత్రుల్లో  ఏడవ రోజున కాళరాత్రి దేవిని పూజించాలి.

మీ జాతకంలో అభివృద్ధికి అవరోధంగా రాహువు పని చేస్తున్నట్లయితే.. దానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి నవరాత్రుల రెండవ రోజున  బ్రహ్మచారిని అమ్మవారిని సంప్రదాయాలను అనుసరించి పూజించాలి.

కేతువు మీ జాతకంలో చాలా ఇబ్బందులను కలిగిస్తే.. నవరాత్రుల్లో మూడవ రోజున.. చంద్రఘంట అమ్మవారిని ప్రత్యేకంగా పూజించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)