Navaratri 2022: అష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా అమ్మవారు.. పోటెత్తిన భక్తగణం

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు అష్టమిరోజున శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తున్నారు.అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు అమ్మవారు మహాకాళి అలంకారంలో దర్శనమిస్తున్నారు.

Navaratri 2022: అష్టమి రోజున ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవిగా అమ్మవారు.. పోటెత్తిన భక్తగణం
Indrakeeladri Navaratri

Updated on: Oct 03, 2022 | 8:59 AM

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రి పై ఎనిమిదవ రోజుకు  దసరా శరన్నవరాత్రి  మహోత్సవాలు చేరుకున్నాయి. ఈ రోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు అష్టమిరోజున శ్రీ దుర్గాదేవి అలంకారంలో  కనువిందు చేస్తున్నారు.  సర్వ స్వరూపిణీ శక్తిస్వరూపిణి దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఈ రోజు అమ్మవారు మహాకాళి అలంకారంలో దర్శనమిస్తారు. దేవీ నవరాత్రులలో అత్యంత ప్రాధాన్యమైన రోజు దుర్గాష్టమి.

అయితే  ఆదివారం రోజున దుర్గ గుడి హిస్టరీలో స్థాయిలో భక్తులు దర్శనం చేసుకున్నారు. నిన్న  ఒక్కరోజే అత్యధిక దర్శనాలు జరిగినట్లు ఆలయాధికారులు చెప్పారు. మూల నక్షత్రం రోజు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో క్యూ లైన్లో ఉన్న చివరి వ్యక్తి వరకు సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్ధరాత్రి ఒంటిగంట పది నిమిషాల వరకు దర్శనాలు కొనసాగాయి. అయితే ఈరోజు నవరాత్రుల్లో ముఖ్యమైన దుర్గాష్టమి కనుక నిన్నటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆలయాధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి