దేశ వ్యాప్తంగా నాగ పంచమిని ఘనంగా జరుపుకుంటున్నారు. పాముల పుట్టల వద్ద, శివాలయంలోనూ, సుభ్రమన్యస్వామి ఆలయాల్లోనూ భక్తుల సందడి నెలకొంది. నాగ పంచమి రోజున నాగ దేవతను ఆరాధించడం వలన ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది. శివుడు ఆశీస్సులు లభిస్తాయి. నాగదేవతను శివాభరణంగా భావిస్తారు. కనుక నాగ పంచమి రోజున శివుడిని, సర్పాన్ని ఆరాధించడం వలన జీవితంలో సంతోషం నెలకొంటుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. శివుని దయతో కుటుంబంలో సర్పం బారి నుంచి రక్షింపబడతారని నమ్మకం. ఈ రోజు నాగ పంచమి శుభ సందర్భంగా సంపదను పెంచుకోవడానికి కొన్ని చర్యలు చేయాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వలన ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతారు. లక్ష్మి దేవి అనుగ్రహంతో మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. కనుక ఈ రోజు ఆర్ధిక ఇబ్బందులను తొలగించుకోవడానికి కొన్ని సులభమైన పరిష్కారాలను గురించి తెలుసుకుందాం..
నాగ పంచమి నాడు పూజ చేసిన తరువాత.. 5 వక్కలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రపరచండి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. చేపట్టిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారు. ఒక సంవత్సరం పాటు ఈ వక్కలను అలాగే ఉంచాలి మళ్ళీ ఏడాది నాగ పంచమి రోజున యధావిదిగా ఈ వక్కలను మార్చి మరొక కొత్త వక్కలు పెట్టుకోవాలి.
పసుపు గవ్వలు: నాగ పంచమి రోజున, పసుపు గవ్వలను పూజించి వాటిని పచ్చి ఆవు పాలలో కాసేపు నానబెట్టి, గంగాజలంతో శుభ్రం చేసి డబ్బులు పెట్టుకునే పెట్టెలో ఐదు గవ్వలను ఉంచండి. ఇలా చేసే వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సంపద ఎల్లప్పుడూ పెరుగుతుంది. శివుని ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉంటాయి. పసుపు గవ్వలు లక్ష్మీ దేవికి చాలా ప్రియమైనదిగా పరిగణించబడుతుంది. సురక్షితమైనది లక్ష్మిదేవి స్థానంలో ఈ గవ్వలను పెట్టుకోవడం వలన ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది.
నాగ పంచమి నాడు శంఖాన్ని పూజించండి: నాగ పంచమి రోజున దక్షిణవర్తి శంఖాన్ని పూజించండి. పూజ తర్వాత శంఖాన్ని భద్రంగా లేదా మీ డబ్బు స్థలంలో ఉంచండి. శంఖాన్ని పూజించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయి. లక్ష్మిదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం లభిస్తుంది. నాగ పంచమి రోజున ఈ శంఖం పరిహారాన్ని చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోయి సిరి సంపదలతో జీవిస్తారు.
నాగ పంచమి నాడు వెండి నాణేలతో పరిహారం: నాగ పంచమి నాడు వెండి నాణెం ఉపయోగించడం చాలా శ్రేయస్కరం. వెండి నాణేన్ని ఎర్రటి దారంతో కట్టి భద్రంగా ఉంచాలి. ఈ పరిహారాన్ని పాటించడం వల్ల వ్యాపారంలో లాభాలు వస్తాయి. సంపద పెరుగుతుంది. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా వ్యాపారస్తుల వ్యాపారం పురోగమిస్తుంది. చేపట్టిన వృత్తిలో వృద్ధి, సంపద పెరుగుతుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు