Hanuman Temple: అక్కడ హనుమంతుడి ఆలయంలో ముస్లింలే పూజారులు.. ఎందుకంటే

హిందువులు పూజించే దేవుళ్ళలో హనుమంతుడు ఒకరు. దేశ వ్యాప్తంగా అనేక హనుమంతుడు ఆలయాలున్నాయి. అయితే ఇది ఒక ప్రత్యేకమైన హనుమంతుడి ఆలయం. ఈ ఆలయంలో హనుమంతుడికి పూజను హిందువులు చేయరు. ముస్లింలు చేస్తారు. ఇక్కడ సంవత్సరాలుగా ఈ ఆలయానికి రోజువారీ పూజల బాధ్యతను ముస్లింలు తీసుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం.

Hanuman Temple: అక్కడ హనుమంతుడి ఆలయంలో ముస్లింలే పూజారులు.. ఎందుకంటే
Hanuman Temple

Updated on: May 17, 2025 | 7:06 AM

మన దేశం వైవిధ్యానికి నిలయం. ఇక్కడ అన్ని మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఇక్కడ చాలాసార్లు మనం మత సామరస్యాన్ని తెలిపే సంఘటనల గురించి వార్తలు వింటాము. అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఏ మతమైనా విశ్వాసమే గొప్పదని చాటి చెబుతాయి. ఈ రోజు మనం హిందువులు కాదు ముస్లింలు పుజాదికార్యక్రమలను మతం, ఆరాధనలు పాటించే ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ ముస్లింలు కూడా హనుమంతుడిని పూజిస్తారు. దాదాపు 150 సంవత్సరాలుగా.. ముస్లిం పూజారులు మాత్రమే ఈ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు.

ఈ ఆలయంలో ముస్లింలు హనుమంతుడిని పూజిస్తారు.

హిందూ మతంలో హనుమంతుడిని సంకట మోచనుడు (అన్ని కష్టాలు, దుఃఖాలు, కష్టాలు, సమస్యలను క్షణాల్లో తొలగించేవాడు) అని చెబుతారు. ఇందుకు కొన్ని సంఘటనలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ముస్లిం సమాజానికి చెందిన ప్రజలు పూజించే హనుమంతుడి ఆలయం ఎక్కడ ఉన్నదంటే..

ఈ ఆలయం ఎక్కడ ఉంది?

ఈ ఆలయం కర్ణాటకలోని గడగ్ జిల్లా కొరికొప్ప గ్రామంలో ఉంది. ఈ ఆలయం పేరు లక్ష్మేశ్వర హనుమంతుడి ఆలయం. ఈ ఆలయం పట్ల ప్రజల విశ్వాసం, నమ్మకాలు చాలా బలంగా ఉన్నాయి. హిందువులు, ముస్లింలు ఇద్దరూ ఇక్కడకు వచ్చి పూజలు చేస్తారు. అయితే ఇక్కడ పూజ చేసేది మాత్రం ముస్లింలు మాత్రమే. ఈ ఆలయానికి ఎవరు వచ్చినా వారి కోరికలన్నీ నెరవేరుతాయని, వారు కష్టాలను అధిగమించి హనుమంతుడి ఆశీస్సులు పొందుతారని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆలయానికి సంబంధించిన కథ

నిజానికి ఈ ఆలయంలో ముస్లింలు పూజలు చేయడం వెనుక ఒక ప్రసిద్ధ కథ ఉంది. ఈ గ్రామంలో కలరా వ్యాపించిన తర్వాత, గ్రామంలోని ప్రజలందరూ నెమ్మదిగా చనిపోవడం మొదలైంది. అదే సమయంలో భయంతో కొంతమంది గ్రామాన్ని వదిలి వెళ్లడం ప్రారంభించారని చెబుతారు. కొన్ని రోజులకే గ్రామం దాదాపు ఖాళీ అయింది. అయితే అక్కడ కొన్ని ముస్లిం కుటుంబాలు తమ ఉన్న ఊరిని వదులలేక .. అక్కడ ఉన్న హనుమంతుడి ఆలయంలో పూజించడం మొదలు పెట్టాయి. ఈ క్రమంగా ఆ వ్యాధి అంతమైంది. అప్పటి నుంచి ఈ ఆలయానికి వచ్చే వ్యక్తి భక్తుడి ప్రతి కష్టమూ తొలగిపోతుందనే నమ్మకం భక్తులకు పెరిగింది. ఈ సంఘటన నుంచి నేటి వరకు, ముస్లిం మతస్తులకు సంబంధించిన చెందిన వారు మాత్రమే ఈ హనుమంతుడి ఆలయాన్ని పూజించే బాధ్యతను తీసుకున్నారు. కనుక మతం ఏదైనా విశ్వాసం గొప్పదని నిరూపిస్తున్నారు ఇక్కడ ఉన్న ముస్లింలు.

శని, మంగళవారాల్లో భారీ సంఖ్యలో భక్తులు

ఇక్కడ ఐక్యతా స్ఫూర్తిని తెలియజేసే విధంగా శని, మంగళవారాల్లో హనుమంతుడి ఆలయంలో అందరూ ఒకటి అవుతారు. స్థానికులతో పాటు పొరుగు గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు హనుమంతుడిని పూజించడానికి వస్తారు. ఈ సందర్భంలో ఈ గ్రామంలోని మనుషుల శాశ్వత ఐక్యత, మత సామరస్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు