Nellore: చెంగాళమ్మ ఆలయానికి రూ.10 కోట్లు ఎంపీ వేమిరెడ్డి విరాళం.. గోపురం బంగారు తాపడం పసులు ప్రారంభం

Nellore Chengalamma Temple: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లోని నెల్లూరుజిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేట(Sullurpet)లో మహిమానిత్వ అమ్మవారుగా..

Nellore: చెంగాళమ్మ ఆలయానికి రూ.10 కోట్లు ఎంపీ వేమిరెడ్డి విరాళం.. గోపురం బంగారు తాపడం పసులు ప్రారంభం
Chengalamma Temple

Updated on: Feb 18, 2022 | 8:50 PM

Nellore Chengalamma Temple: ఆంధ్రప్రదేశ్(Andhrapradesh) లోని నెల్లూరుజిల్లాలో తమిళనాడుకి సరిహద్దులో ఉన్న సూళ్లూరు పేట(Sullurpet)లో మహిమానిత్వ అమ్మవారుగా గత కొన్ని వందల ఏళ్లుగా శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి పూజలను అందుకుంటున్నారు.  ఈ చెంగాళమ్మ ఆలయాభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి భూరి విరాళం ఇచ్చారు. చెంగాళమ్మ ఆలయ గోపురం బంగారు తాపడం చేయించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకొచ్చారు. తన వంతుగా పది కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. అంతేకాదు ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులను  వేమిరెడ్డి దంపతులు ప్రారంభించారు.

సువిశాల ప్రాంగణంలో శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయ సముదాయం నిర్మించబడి ఉంటుంది. తూర్పు వైపున స్వాగత ద్వారం, రాజ గోపురం నిర్మించారు. ఉప ఆలయాలలో గణపతి, లింగ రూప కైలాసనాధుడు, నాగ దేవతలు కొలువుతీరి దర్శనమిస్తారు.

ఆలయం నిర్మించిన దగ్గర నుండి బలిజలే పూజాదికార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆలయానికి ఎటువంటి తలుపులు ఉండవు.  ఏడు ఏళ్లకు ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో దేవాలయం వద్ద “సుడి మాను” తిప్పటం ఒక ఆచారంగా వస్తోంది. ప్రతి పౌర్ణమికి అమ్మవారికి ప్రీతికరమైన నవ కలశ అభిషేకం, మహా చండీ యాగం ఆర్జిత సేవలను నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో పెళ్లి, ఉపనయనం, బారసాల,  అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను భక్తులు నిర్వహిస్తారు. అందుకు తగిన ఏర్పాట్లను ఆలయాధికారులు చేశారు.

Also Read:

చిచ్చు రేపిన ఆర్థిక విభేదాలు.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య.. భర్త మృతిని తట్టుకోలేక..